Viral Video: నువ్ పోలీసోడైతే నాకేంటీ..?.. ప్రయాగ్ రాజ్ ట్రైన్ లో రెచ్చిపోయిన టీటీఈ.. షాకింగ్ వీడియో వైరల్..

Maha kumbh mela: కుంభమేళకు వెళ్తున్న ఒక ట్రైన్ లో పోలీసు అధికారి ఏకంగా ఏసీ కోచ్ లో వచ్చి పడుకుని కూర్చున్నాడు. అంతేకాకుండా..  అక్కడున్న ప్రయాణికులతో వివాదాస్పదంగా ప్రవర్తించాడు.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 24, 2025, 02:46 PM IST
  • ఏసీ కోచ్ లో కూర్చున్న పోలీసు..
  • సీరియస్ అయిన టీటీ..
Viral Video: నువ్ పోలీసోడైతే నాకేంటీ..?.. ప్రయాగ్ రాజ్  ట్రైన్ లో రెచ్చిపోయిన టీటీఈ..  షాకింగ్ వీడియో వైరల్..

Tte angry on police in prayag raj train video viral: ప్రయాగ్ రాజ్ కుంభమేళ భక్త జన సంద్రంగా మారింది. కుంభమేళకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 26 న చివరి షాహి స్నానం మిగిలి ఉంది. దీంతో ప్రస్తుతం భక్తులు భారీగా తరలి వస్తునే ఉన్నారు. రైళ్లు , విమానాలు, ప్రైవేటు బస్సులు, వాహానాలలో కుంభమేళకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు.

Add Zee News as a Preferred Source

యూపీ సర్కారు సైతం.. ఎక్కడ కూడా భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది.  ఈ క్రమంలో కుంభమేళలోఒకవైపు ట్రైన్ లన్ని ఫుల్ రష్ గా ఉండటంతో.. జనాలు ఏసీ భోగీల్లోకి వెళ్లి కూర్చుంటున్నారు.  దీంతో ఏసీలో సీట్లను బుక్ చేసిన ప్రయాణికులు గగ్గొలు పెడుతున్నారు. చాలా చోట్ల ఏసీ గదుల్లో సైతం.. ప్రయాణికులు నడిచే మార్గంలో భక్తులు కూర్చుని ప్రయాగ్ రాజ్ కు ప్రయాణిస్తున్నారు.

 

 ఈ క్రమంలో ఒక ట్రైన్ లో పోలీసు అధికారి ఏకంగా ఏసీ కోచ్ లోకి వెళ్లి బిందాస్ గా పడుకున్నాడు. అతను దీనిపై ఆ సీటులోని ప్రయాణికుడు ప్రశ్నించగా... సీరియస్ గా సమాధానం ఇచ్చాడు. దీంతో సదరు ప్రయాణికుడు.. టీటీఈకి ఫిర్యాదు చేశాడు.  టీటీఈ అక్కడకు చేరుకుని పోలీసుకు టికెట్ చూపించాలని అడిగాడు. అతను మాత్రం.. జనరల్ టికెట్ చూపించాడు. దీంతో టీటీఈ ఇదిఏసీ కోచ్ అని కూడా సీరియస్ అయ్యారు.

Read more: Bride attends Groups-2: జీలకర్ర బెల్లంతోనే గ్రూప్ 2 పరీక్షకు హజరైన నవ వధువు.. వీడియో వైరల్..

దీనిలో అప్పటికే ఇతరులు ఉన్నారని.. ఇలా వాళ్ల సీటులో కూర్చొవడం ఏంటని కూడా మండిపడ్డారు. పోలీసంటే.. చాలా మంది ఎంతో రెస్పెక్ట్ గా చూస్తారన.. ఇలాంటి పనులతో మీ గౌరవం కోల్పోయేలా ప్రవర్తించకూడదని కూడా అన్నారు. వెంటనే ఏసీ నుంచి.. జనరల్ కోచ్ లోకి వెళ్లిపోవాలని కూడా టీటీఈ స్పష్టం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాయలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా పొలీసు ప్రవర్తనపై మండిపడుతున్నారు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News