Mallareddy Viral Video On Heroine: మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వైరల్ కామెంట్స్ చేశారు. సరదా కామెంట్లతో వార్తల్లో నిలిచే మాజీ మంత్రి ఈ సారి ఓ హీరోయిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ఓ సినమా ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఆ సినిమా హీరోయిన్ కసి కపూర్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ పేరు కసి కపూర్ అంట మంచి కసికసిగా ఉంది అన్నారు. దీంతో ఆ ఈవెంట్‌లో ఉన్న అందరూ పగలబడి నవ్వారు. ఇక ఆ సినిమా హీరో కూడా తన కాలేజీలో పనిచేసే ప్రిన్సిపల్ తన కాలేజీలోనే చదువుకున్నాడు అన్నారు. ఇక అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పడంతో మల్లారెడ్డిపై మరిన్ని విమర్శలు చేస్తున్నారు.
ఈయన మా స్టూడెంట్ అని హీరోని పొగిడారు. ఇక్కడే చదివాడు, ఇక్కడే హీరో అయ్యాడు. ఇక్కడే సినిమా ప్రమోషన్ కూడా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు మల్లారెడ్డి. ఎన్నోసార్లు మూవీ ప్రమోషన్లకు రమ్మని పిలిచారు కానీ, కుదరలేదు. ఈసారి అసెంబ్లీకి డుమ్మా కొట్టి వచ్చాను అన్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గతంలో కూడా చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతూనే ఉంటాయి. ఆయన ప్రధానంగా సినిమా ప్రమోషన్లో చేసే ఫన్నీ కామెంట్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. మల్లారెడ్డి ఇటీవలే హీరో నితిన్‌తో కలిసి కూడా డాన్స్ చేసిన వీడియో నెట్టెంటా వైరల్ అయింది. తన వివాహ వార్షికోత్సవ సెలబ్రేషన్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు రాబిన్ హుడ్ సినిమా బృందం తరఫున హీరో నితిన్ హాజరయ్యారు.
ALSO READ: Myanmar: ఘోర విషాదం.. మయన్మార్ భూకంపం ఘటనలో 1000 మృతి, భారత్ భారీ సాయం..
ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న మల్లారెడ్డి నితిన్ కలిసి కాలేజీలో హల్‌చల్ చేశారు. మల్లారెడ్డి తనదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ ఉంటారు.. అవి కాస్త వైరల్ గా మారతాయి. అయితే ఆయన స్టూడెంట్‌తో పాటు హీరో నితిన్ తో కలిసి స్టెప్పులు వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. చామకూరి మల్లారెడ్డి ప్రముఖ రాజకీయవేత్త అయిన కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయిన ఎన్నికయ్యారు. 2014 తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయ కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ తో పాటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి.
ALSO READ: Today Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశికి ఎలా ఉంటుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









