King Cobra Snake Viral Video: సాధారణంగా పాముల్ని చూస్తే ఎవరైన దూరంగా పారిపోతుంటారు. అందులో కింగ్ కోబ్రా కన్పిస్తే ఇంకేమైన ఉందా.. అసలు.. రాచనాగు మాములు సర్పాలు కన్నా చాలా డెంజర్ గా ఉంటుంది. అది 8 నుంచి 12 అడుగుల వరకు పొడవుతుంటుంది. అది మనిషి అంత ఎత్తుకు కూడా కొన్ని సందర్బాలలో నిలబడుతుంది. పాములు ఎక్కువగా అడవులు, ఎలుకలు ఉన్న ప్రదేశంలో ఉంటాయి. పంటపోలాలలో కూడా ఉంటాయి.
ఇంట్లో పాములు వస్తే చాలా మంది భయపడిపోయి స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇస్తారు. కానీ కొందరు మాత్రం పాములను టార్చర్ పెడుతుంటారు. పాములను కర్రలతో కొడుతుంటారు. పాము కాటు వేస్తే.. దాని మీద రీవెంజ్ సైతం తీర్చుకుంటారు. మొత్తంగా పాములు అని పేరు ఎత్తడానికి సైతం చాలా మంది భయంతో వణికిపోతారు. ఈ క్రమంలో ఒక స్నేక్ క్యాచర్ వట్టి చేతులతో కింగ్ కోబ్రాను పట్టుకొవడానికి వచ్చాడు. అతని ముందు కింగ్ కోబ్రా బుసలుకొడుతూ.. చుట్టుకుని కూర్చుంది.
Catching the King Cobra - Thailand
?roamingbangkok
— Science girl (@gunsnrosesgirl3) March 21, 2025
అతను కనీసం స్టిక్ కూడా లేకుండా కోబ్రాను పట్టుకునేందుకు వచ్చాడు. కింగ్ కోబ్రాను చాకచక్యంగా అదేదో.. కోడినో మరేంటో దాన్ని పట్టుకున్నట్లు .. కోబ్రా మెడను ఒక్కసారిగా పట్టుకున్నాడు. అక్కడున్న వారంత చూసి షాక్ అయ్యారు. కోబ్రాను చూసి అక్కడున్న వారంత భయంతో పరుగులు పెట్టారు.
Read more: Elephant Video: వావ్ .. చెఫ్‌గా మారి.. గరిట తిప్పుతూ, మసాల దినుసులు దంచుతున్న ఏనుగు.. వైరల్ వీడియో..
కానీ స్నేక్ క్యాచర్ మాత్రం ఏ మాత్రం భయంలేకుండా.. ఎంతో నేర్పుతో కింగ్ కోబ్రాను బంధించాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం.. ఏంట్రా.. మరీ ఇంత భయంలేకుండా.. పాముల్ని పడుతున్నాడంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









