)
Man dies with heart attack in onam celebration dance video: ఇటీవల కాలంలో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని సిట్యూవేషన్ ఏర్పడింది. అప్పటి వరకు బాగానే ఉన్న వారు కాస్త ఒక్కసారిగా కుప్పకూలీ పోతున్నారు. ఒకప్పుడు హర్ట్ ఎటాక్ అనేది పెద్ద ఏజ్ లో ఉన్న వారికి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం చిన్నపిల్లల్లో, మిడిల్ ఏజ్ వారిలో కూడా హర్ట్ ఎటాక్ సంభవిస్తుంది. ఇటీవల జిమ్ లో, ఆఫీస్ పనులు చేస్తు, బరాత్ లో డ్యాన్స్ లు చేస్తు హర్ట్ ఎటాక్ లతో చాలా మంది చనిపోయిన అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఓనం వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి
కేరళ ఓనం వేడుకల్లో విషాదం
సంతోషంగా డ్యాన్స్ స్టెప్పులేస్తూ, గుండెపోటుతో కుప్పకూలి జునేష్ అబ్దుల్లా(45) మృతి pic.twitter.com/MoclWHTQI1
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2025
అప్పటి వరకు బాగానే ఉన్న వాళ్లు కాస్త ఒక్కసారిగా కుప్పకూలీ చనిపోతున్నారు. ఈ క్రమంలో మారిపోయిన జీవన శైలీ, ఆహరపు అలవాట్ల వల్ల ఈ విధంగా శరీరంపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం కేరళలో ఓనం వేడుకల్లో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కేరళలో ఓనం పండుగ వేడుకలు జరుగుతున్నాయి. స్థానికంగా కొంత మంది యువతీ, యువకులు ఎంతో జోష్ తో ఓనం ఫెస్టివల్ ను గ్రాండ్ గా నిర్వహించుకున్నారు. స్టేజీ మీద యువతీ, యువకులు డ్యాన్స్ లతో రచ్చ చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఫుల్ జోష్, డీజే పాటలతో అక్కడంతా ఉల్లాసంగా ఉన్నారు. కానీ ఇంతలో ఒక వ్యక్తి డ్యాన్స్ చేస్తు కుప్పకూలీ పడిపోయాడు. ఆ వ్యక్తిని జునేష్ అబ్దుల్లాగా (45) గుర్తించారు.
వెంటనే చుట్టుపక్కల వారు అతడ్ని లేపేందుకు ప్రయత్నించాడు. కానీ అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అందరు అతను డ్యాన్స్ లో భాగంగా ఇలా చేస్తున్నాడని భావించారు. కానీ అతను ఎంత లేపిన కూడా లేవలేదు. చివరకు అక్కడకు వచ్చిన కొంత మంది వైద్యులు అతడ్ని చూసి.. అప్పటికే గుండెపోటుతో చనిపోయాడని చెప్పారు. దీంతో ఓనం వేడుకల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.