Man Drinking Alcohol In Delhi Metro Video Watch: తరచుగా సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రో కు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే కొంతమంది ప్రయాణికులు చేసే వికృతి చేష్టలు దురుసు ప్రవర్తనలకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు ఇప్పటివరకు వైరల్ అయ్యాయి. కొంతమంది ఢిల్లీ మెట్రోలో కావాలని రొమాన్స్ చేసుకోవడం, ఫ్రాంక్ వీడియోలు తీయడం ఇలా చాలా వికృతి చేష్టలు చేశారు. వీటికి సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కోచుల్లో ఆహారం, త్రాగడం నిషేధిత నిబంధనలు ఉన్నప్పటికీ..ఓ వ్యక్తి ఈ రూల్స్ కి వ్యతిరేకంగా చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
ఢిల్లీ మెట్రోలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, పానీయాలు సేవించడం నిషేధితమైనప్పటికీ ఓ వ్యక్తి ఏకంగా గుడ్డు తిని మద్యం సేవించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో వివరాల్లోకి వెళితే, మార్చి 23న రాత్రి 10 గంటల ప్రాంతంలో కర్కర్‌డూమా కోర్ట్ మెట్రో స్టేషన్ నుంచి ప్రయాణం చేస్తున్న ఓ మెట్రో రైల్లో ఓ వ్యక్తి ప్రయాణం చేస్తున్న సమయంలోనే గుడ్డుతో తయారుచేసిన ఆహారం తిని.. మద్యం సేవించాడు. అయితే తోటి ప్రయాణికులు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విపరీతంగా వారిలయ్యాయి.
Eggs & "Alcohol" in the Metro? That’s not breakfast - that’s a Breach !!
Break the rules, Face the consequences, Rules aren’t suggestions: They’re the law.#DPUpdates pic.twitter.com/CP2P5fDFiW
— Delhi Police (@DelhiPolice) April 9, 2025
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఆసరాగా చేసుకుని పోలీసులు కేసు బుక్ చేసి రంగంలోకి దిగారు.. నిందితుడు ఆకాష్ కుమార్ గుర్తించి పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఈ వీడియోను ఢిల్లీ పోలీస్ అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా సోషల్ మీడియాలోకి పోస్ట్ చేశారు. నిందితుడు పై సెక్షన్ 59 కింద కేస్ బుక్ చేసి రిమాండ్కు తరలించారు. ఏది ఏమైనా తోటి ప్రయాణికులను ఇబ్బంది గురి చేయడం అంత మంచిది కాదు. దీనికి సంబంధించిన సన్నివేశాలను అక్కడే ఉన్న కొంతమంది స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వీడియోకు సంబంధించిన వివరాలు..
కదులుతున్న మెట్రోలో ఓ వ్యక్తి కూర్చొని ఉండడం మీరు గమనించవచ్చు. అలాగే తన బ్యాగులో నుంచి ఒక కవర్ తీసి అందులో ఉన్న గుడ్డును తీసి పగలగొట్టి పైపు పెంకులు తీసి కవర్లో వేయడం మీరు చూడవచ్చు. పూర్తిగా పెంకులు తీసిన గుడ్డును ఆ వ్యక్తి తినడం కూడా ఈ వీడియోలో గమనించవచ్చు. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసి అందులో మద్యం పోసుకొని తాగడం కూడా మీరు చూడవచ్చు.. ఇప్పుడు ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









