Gorilla Video: నువ్వు గ్రేట్ భయ్యా.. గొరిల్లాకు చేతులతో నీళ్లను తాగించి.. నెట్టింట ఎమోషన్ తెప్పిస్తున్న వీడియో..

Viral Video: గొరిల్లాకు ఎండకు తాళలేక ఇబ్బందులు పడుతుంది. ఇంతలో అక్కడే ఉన్న వ్యక్తి దాని దాహర్తిని తీర్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 28, 2025, 02:58 PM IST
  • గొరిల్లా దాహం తీర్చిన వ్యక్తి..
  • వీడియో వైరల్..
Gorilla Video: నువ్వు గ్రేట్ భయ్యా.. గొరిల్లాకు చేతులతో నీళ్లను తాగించి.. నెట్టింట ఎమోషన్ తెప్పిస్తున్న వీడియో..

Man Feeds Water To Gorilla With His Bare Hands video: కొన్నిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి మనుషులే కాదు.. నోరు లేని జీవాలు సైతం తెగ  విలవిల్లాడిపోతున్నాయి. అసలు.. ఉదయం 10 దాటిందంటే చాలు..  ఇంటి నుంచిబైటకు వెళ్లాలంటేనే జనాలు వణికిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప బైటకు వెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మనమే ఇలా ఉంటే.. అడవిలో ఉండే నోరులేనీ జీవాలు ఎంతగా ఎండకు ప్రభావానికి గురౌతాయో ఊహించుకొవచ్చు.

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా అడవిలో జంతువులకు సమ్మర్ వచ్చిందంటే తాగడానికి నీళ్లు దొరకవు. అడవిలో ఉండే సరస్సులు ఇంకిపోతాయి. ఫారెస్ట్ సిబ్బంది అక్కడక్కడ నీళ్లను ఏర్పాటు చేస్తారు. తాగడానికి నీళ్లు లేక.. అడవిలోకి క్రూర జంతువులు,అడవికి దగ్గరగా ఉండే.. గ్రామాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో  చాలా మంది జంతువులకు సమ్మర్ లో దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నింస్తుంటారు. తమ ఇళ్లలో , బాల్కానీలో నీళ్ల తోట్టేల్ని ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో మరికొందరు అడవిలో జంతువులు ఉండే ప్రదేశాల్లోకి వెళ్లి నీళ్ల సదుపాయం ఏర్పాటు చేస్తారు.

పండ్లు మొదలైనవి అడవిలో వేస్తుంటారు. ప్రస్తుతం ఒక వీడియో వైరల్ గా మారింది. అడవిలో ఒక గొరిల్లా నీళ్లు తాగలేక ఇబ్బంది పడుతుంది. ఇంతలో గొరిల్లాను అక్కడున్న ఒక వ్యక్తి గమనించాడు. అతను ఏమాత్రం భయపడకుండా.. మూర్ఛపోయే స్థితిలో ఉన్న గొరిల్లాకు తన చేతులతో నీళ్లను అందించి మరీ తాగిస్తున్నాడు. పాపం.. దానికి మరీ వడదెబ్బ తాకిందో మరేంటో కానీ.. అది ఎటు కదల్లేక ఇబ్బందులు పడుతుంది. మొత్తంగా అతను పలు మార్లు తన చేతిదోసిట్లో నీళ్లను తీసుకుని గొరిల్లాకు తాగించాడు.

Read more: Snake Video: గుండెలు గుభేల్.. మహిళ జుట్టులో హల్ చల్ చేస్తున్న శ్వేతనాగు పిల్ల... వీడియో వైరల్..

అదితన దాహంను తీర్చుకుని ప్రేమతో అతడి తలను తన దగ్గరకు తీసుకుంది. చాలా థైంక్స్ అన్నట్లు ప్రవర్తించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఎమోషన్ అవుతున్నారు. నిజంగా అతను గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News