Snake in Ice Cream: బాప్ రే బాప్.. ఐస్ క్రీమ్ తింటుండగా బైటపడ్డ గడ్డ కట్టిన పాము.. ఎక్కడో తెలుసా..?

Frozen snake in ice cream:  థాయిలాండ్ లోని ముయాంగ్ లో ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ ను కొనితింటున్నారు. ఇంతలో అతగాడి ఐస్ క్రీమ్ లో గడ్డకట్టిన పాము బైటపడింది.ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 7, 2025, 04:04 PM IST
  • ఐస్ క్రీమ్ లో పాము..
  • భయపడిపోతున్న నెటిజన్లు..
Snake in Ice Cream: బాప్ రే బాప్.. ఐస్ క్రీమ్ తింటుండగా  బైటపడ్డ గడ్డ కట్టిన పాము.. ఎక్కడో తెలుసా..?

Frozen snake found in ice cream thailand: ఇటీవల కాలంలో రెస్టారెంట్ లు, హోటల్స్ లకు వెళ్లాలంటేనే చాలా మంది భయంతో చచ్చిపోతున్నారు. మొత్తంగా ఫుడ్ లో కొన్నిచోట్లలో బొద్దింకలు, పురుగులు, చనిపోయిన కప్పలు, ఇతర జీవుల అవశేషాలు బైటపడుతున్నారు. దీంతో జనాలు సరదగా బైటకు వెళ్లి తినేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు చేస్తున్న కూడా.. రెస్టారెంట్లు, హోటల్స్ సిబ్బంది ఆసమయం వరకు ఏదో కొంత మంచిగా ఫుడ్ ఇస్తున్నట్లు చేసి మరల.. వారి పనులు వారు చేసుకుంటున్నారు. చాలా చోట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు మాముళ్లు తీసుకుని .. వీరి నిర్వాకాన్ని చూసి చూడనట్లు వదిలేస్తుంటారని కూడా చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక హోటల్ కు వెళ్లి ఐస్ క్రీమ్ కొనుక్కునేందుకు వెళ్లిన ఒక వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది.ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. 

థాయిలాండ్ లోని ముయాంగ్ రాట్చబురిలో ప్రాంతానికి చెందిన 'రేబాన్ నక్లెంగ్‌బూన్' అనే వ్యక్తి ఇటీవల అక్కడి ఒక  హోటల్ నుంచి  బ్లాక్ బీన్ ఐస్ క్రీం బార్ తెచ్చుకున్నాడు. కవర్ తీసేసి.. పుల్ల ఐస్ క్రీమ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తు తింటున్నాడు. ఇంతలో అతనికి అనుకొని ఘటన ఎదురైంది.

ఐస్ క్రీమ్ లో ఏదో ఉన్నట్లు చూశాడు. వెంటనే తెరుకుని.. ఐస్ క్రీమ్ ను గమనించి చూస్తే.. అక్కడ చనిపోయిన ఒక పాము అవశేషం ఉంది.  మొత్తంగా చిన్న పాము ఐస్ లో గడ్డకట్టుకుని పోయింది. ఇది చూసి అతను భయంతో వణికిపోయాడు. వెంటనే ఈ  ఘటనను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్  చేశాడు. దీన్ని చూసిన వారంత ప్రస్తుతం షాక్ అవుతున్నారు.

Read more: Romance Video: ఛీ.. ఛీ.. ఆఫీసులో రెచ్చిపోయిన ప్రిన్సిపాల్.. లేడీ టీచర్‌తో రాసలీలలు.. వీడియో వైరల్..

అతగాడు.. సదరు హోటల్ వాళ్ల మీద ఫుడ్ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతంసామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News