man hugs Big crocodile like a girl friend funny video: సాధారణంగా అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి. పులులు, సింహలు, ఎలుగు బంట్లు, మొసళ్లు, ఏనుగులు, చిరుతలు మొదలైనవి ఉంటాయి. అయితే.. ఈ జంతువులు తమ దాహన్ని తీర్చుకునేందుకు అడవిలోని సరస్సులకు వెళ్తుంటాయి. నీటిలో భారీ మొసళ్లు ఉంటాయి. అవితమ దాహం తీర్చుకునేందుకు వచ్చిన జంతువుల్ని చంపితినేస్తుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా మొసలి బారిన పడితే.. దానికి ఆహారం అయిపోవాల్సిందే. అయితే..
చాలా మంది నీళ్ల దగ్గరకు వెళ్తే ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కొత్త ప్రదేశాలలో వెళ్లేందుకు అంత ఈజీగా డేర్ చేయరు. అడవిలోని నీటిలో మొసళ్లు,పెద్ద పెద్ద జలచరాలు ఉంటాయి. నీటిలో మొసలికి పదిఏనుగుల బలం ఉంటుందంటారు. అందుకే నీటిలో మొసలి ఉంటే.. ఆ పక్కకు వెళ్లేందుకు భారీ సింహలు, ఏనుగులు సైతం భయంతో దూరంగా వెళ్లిపోతాయి.
ఈ క్రమంలో మొసలికి నీటిలో ఉంటే.. ఎంత బలముంటుందో.. అదే బైటకు వస్తే ఆ బలం మాత్రం ఉండదు. కుక్క కూడా దాన్ని పరిగెత్తించి మరీ దాడి చేస్తుంది. అయితే.. కొంతమంది ఇటీవల డెంజర్ జంతువుల్ని పెంచుకుంటున్నారు. పాములు, కొండ చిలువలు, మొసళ్లు.. ఇలా ప్రాణానికి హనీ కల్గించే జంతువులతో కూడా చనువుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక భారీ మొసలిని ఒక వ్యక్తి పెంచుకుంటున్నాడో మరేంటో కానీ.. దాన్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. అతను వెల్లికిలా పడుకుని మరీ మొసలిని గట్టిగా కౌగించుకున్నాడు.
ఆ మొసలి కూడా వాడ్ని అస్సలు ఏమనట్లేదు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదేమన్న నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావా.. ఏంటీ.. అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఓరెయ్ అది తినేస్తే నీ ఎముకలు కూడా దొరకవని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.









