)
Man playing with hundreds of cobra snakes trending video: పాముల్ని చూస్తే ప్రాణాల మీద ఆశలు ఉన్న ఎవరైన కిలోమీటర్ దూరం పారిపోతారు. అవి ఉన్న చోటకు మరోసారి అస్సలు పోరు. పాములను చూస్తుంటే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. చాలా మంది పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీవారికి సమాచారం ఇస్తారు. వాటికి అస్సలు ఆపద తలపెట్టారు.
ఈ క్రమంలో పాములకు అపకారం చేస్తే లేని పోనీ దోషాలు చుట్టుకుంటాయంటారు. అందుకే పాములకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడు చేయోద్దంటారు. కానీ కొంత మంది పాముల్ని చూసి భయపడి దూరంగా ఉంటే.. మరికొంత మంది మాత్రం వాటితో చెడుగుడు ఆడుకుంటారు. అచ్చం ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అతని గుండె ధైర్యానికి బిత్తరపోతున్నారు.
ఒక టెంట్ లో వందల కొద్ది నాగు పాములు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మరీ అతను స్నేక్ క్యాచరో లేదా పాముల్ని పట్టుకొవడం అతని హబీనో తెలీదు కానీ.. మొత్తంగా ఒక పాము కన్పిస్తేనే అందరు భయపడిపోతుంటే.. ఇతరుమాత్రం వందల కొద్ది సర్పాలు అతని చుట్టుపక్కల ఉన్న కూడా అవేం పట్లన్నట్లు కూల్ గా వాటితో ఆడుకుంటున్నారు.
అతను పాముల్ని నిమురుతూ..అదేదో అతని పెంపుడు సర్పాలు అయినట్లు ప్రవర్తిస్తున్నాడు. పాములు బుసలుకొడుతున్న ఏ మాత్రం వెరవ కుండా అతని వాటినికూల్ గా తాకుతూ..వాటి కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మరీ వాటిని తన వశం చేసుకుంటున్నాడు.
ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంగుండెరా వాడిది అంటూ కామెంట్లు చేస్తున్నారు.పొరపాటున కాటు వేస్తే ఏంటీ సిట్యూవేషన్ అంటూ అతడిపై నెటిజన్లు మండిపడుతున్నారు.