Man puts Snake in his mouth Video goes viral: చాలా మంది పాములు కన్పిస్తే అక్కడి దూరంగా పారిపోతారు. మరోసారి ఆ ప్రదేశంలోకి వెళ్లరు. ముఖ్యంగా ఎలుకలు ఉన్న చోట పాములు ఎక్కువగా కన్పిస్తాయి. కొంత మంది తమ ఇళ్లలో పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీవారికి సమాచారం ఇస్తారు. దానికిహనీ కల్గించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వాటికిఅపకారం చేస్తే లేని పోనీ దోషాలు చుట్టుకుంటాయని ప్రగాఢంగా నమ్ముతారు.
అదే విధంగా మరికొంత మంది మాత్రం చాలా డెంజర్ గా ఉంటారు. పాములు కన్పిస్తే వాటితో చెడుగుడు ఆడుకుంటారు. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి రిస్క్ లు చేస్తారు. ఇలాంటి ఘటనల్లో కొన్నిసార్లు వారి ప్రాణాలు గాల్లో దీపంలా ఆరిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ విధంగా కొంత మంది స్నేక్ క్యాచర్ లు పాముల్ని పట్టుకునేక్రమంలోస్టంట్ లు చేసిన అనేక వీడియోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా.. ఒక స్నేక్ క్యాచర్ నాగుపామును పట్టుకునేందుకు వచ్చాడు. దాన్ని సైలెంట్ గా బంధిస్తే తన స్పెషాలిటీ ఏముంటుందని అనుకున్నాడో ఏంటో కానీ..దాన్ని తన నోటితో బంధించాడు. అంతేకాకుండా.. ఏదో యువతిని లిప్ లాక్ చేసినట్లు పామును నోట్లో కొద్దిసేపు పెట్టుకున్నాడు. పాపం.. అది అతని నుంచి విడ్పించుకోవడానికి విలవిల్లాడిపోయింది.
Read more: Snake Video: బాప్ రే.. కిచెన్‌లో నక్కి బుసలు కొడుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
ఆ తర్వాత దాన్ని వదిలేసి సంచిలో వేసుకున్నాడు. మరీ దానిలో విషం ఉందో లేదా స్టంట్ లో భాగంగా ఇలా చేశాడో తెలీదు కానీ.. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి పైత్యం రా.. అదేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావా..?.. అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అది కాటు వేస్తే ముద్దులు అటుంచీ.. పైకీ పోతావ్ రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.









