)
Man puts venomous cobra snake in his mouth Trending video: పాముల వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు కోబ్రాల వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి పాముల వీడియోలు కన్పించిన వెంటనే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో అవి కాస్త నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో పాముల్ని చూస్తే చాలా మందివెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. కానీ మరికొంత మంది మాత్రం పాముల పట్ల క్రూరంగా కూడా ప్రవర్తిస్తారు. వాటిని కొట్టి చంపేస్తుంటారు. పాములను బంధించి చిత్రహింసలకు గురిచేస్తారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఒక పాముల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఒక వ్యక్తి తనచేతిలో నాగు పామును పట్టుకున్నాడు. దాన్ని ఏదో అతడి ప్రియురాలు అయినట్లు పామును తన నోట్లో పెట్టుకున్నాడు. పామును మొత్తంగా తన నోటిలో పెట్టేసుకున్నాడు. పాపం.. పాము అతని చెతిలో నుంచి వదిలించుకునేందుకు నానా పాట్లు పడుతుంది. అయిన కూడా అతను దాన్ని వదల్లేదు. దాన్ని నోట్లో పెట్టుకుని చిత్రహింసలకుగురిచేశాడు.
మరీ ఆ పాముకు విషం తీసేశారో, కోరలు పీకేసిన పామొ తెలీదు కానీ.. మొత్తంగా అతను అత్యంత నీచంగా ప్రవర్తించాడు. మరీ ఆ పాము కాటు వేసేందుకు కూడా అతను చాన్స్ ఇవ్వకుండా పైశాచీకంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు ఏంట్రా వీడు.. ఇంత వైలెంట్ గా ఉన్నాడంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నాడు. వదల్రా..ఆ పామును తినేస్తావా ఏంటని కూడా కామెంట్లు పెడుతున్నారు. దీనిపైన జంతుప్రేమికులు, పెటా ప్రతినిధులు మండిపడుతున్నారు.