)
Man rescues baby calf from heavy flood rain in jammu Kashmir video: వరుణుడు ఉత్తర భారతంను వణికిస్తున్నారు. ఎక్కడ చూసిన కూడా కుండపోతగా వానలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తరాది రాష్ట్రాలు వర్షాలతో చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఈ క్రమంలో అధికారులు ముందుజాగ్రత్తగా ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. అయిన కొండ చరియలు విరిగి పడటం, నదులు భయానకంగా ప్రవహిస్తున్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికే భారీ వర్షాలతో అనేక మంది దుర్మరణం చెందారు. అనేక ఇళ్లు వరదల్లో కొట్టుకునిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అల్లకల్లోలం జరుగుతుందని చెప్పవచ్చు. అయితే.. మనుషులే కాకుండా భారీ వర్షాలతో మూగజీవాలు సైతం కొట్టుకుని పోతున్నాయి. ఈ క్రమంలో జమ్ములో ఒక వ్యక్తి తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా భారీ వర్షంలో లేగ దూడ ప్రాణాలు కాపాడారు. ఈ వీడియో వైరల్గా మారింది.
జమ్ములో లేగ దూడ భారీ వర్షంలో తప్పిపోయింది. అది నీళ్లలో కొట్టుకునిపోతుంది. దీంతో అక్కడున్న ఒక వ్యక్తి దీన్ని గమనించాడు. నాకేందుకులే అని అనుకోలేదు. లేగదూడను కాపాడి తన భుజం మీద ఎత్తుకున్నాడు. దానికి ప్లాస్టిక్ కవర్ ను చుట్టి, వర్షంలో తడవకుండా మరీ బైటకు తీసుకొచ్చాడు.
ఆ ప్రవాహంలో నుంచి లేగదూడను కాపాడాడు. దీంతో అక్కడి వారు సదరు వ్యక్తి చూపిన ధైర్యసాహసాలకు ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కూడా లేగదూడను కాపాడిన వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.