Man tried to kisses to venomous cobra snake video: పాముల వీడియోలు ఎప్పటికప్పుడు కొత్తవి ఇటీవల ట్రెండింగ్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నెటిజన్లు కూడా పాముల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పాములు కన్పించగానే స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇస్తారు. కానీ మరికొందరు పాములు కాటు వేస్తే దానిపైన పైశాచీకంగా ప్రవర్తిస్తారు.
మొత్తంగా పాముల్ని కొంత మంది ముద్దులు పెట్టుకుంటే రకరకాలు పనులు చేస్తుంటారు.ఈ క్రమంలో కొంత మంది చేసే పనుల వల్ల వాళ్ల ప్రాణాలు కూడా పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి పామును పట్టుకున్నాడు. మరీ అతని ఏమన్పించిందో ఏంటో కానీ.. దాన్ని ముద్దుపెట్టుకున్నాడు.
మరీ దానికి చిర్రెత్తుకొచ్చినట్లుంది. వెంటనే కోపంతో అతడ్ని తిరిగి కసితీరా కాటేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆ పామును పట్టుకుని అందరు చూస్తున్నారని .. ఏదేదో తింగరి విన్యాసాలు చేయాలని ప్రయత్నించాడు. కానీ అది కోపంలో అతడ్ని కాటు వేసింది.
దీంతో అక్కడి వారంత భయంతో పరుగులు పెట్టారు. ఆ పాము కాటు వేసిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా ఈ పాము వీడియో మాత్రం నెట్టింట మరోసారి తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నీ ప్రియురాలు అనుకున్నావా.. భయ్యా.. అంటూ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు.









