)
Man wrapped cobra snake a round his neck video: చాలా మంది పాములంటే చచ్చేంత భయపడిపోతుంటారు. అసలు పాములు అని పేరు తల్చుకొవడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపించరు. మరికొంత మంది పాములు కన్పిస్తే వాటితో ఆడుకుంటారు. పొరపాటున కాటు వేస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటారు. పాముల కాటుతో చాలా మంది తరచుగా జాగ్రత్తలు పాటిస్తారు. దట్టమైన చెట్లు, అడవులు, చెరువులు ఉన్న చోట పాములు ఎక్కువగా సంచరిస్తాయి.
ఈ క్రమంలో పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వారికి కొంత మంది సమాచారం ఇస్తారు. మొత్తంగా పాముల వీడియోలు ఇటీవల కాలంలో తెగ ట్రెండింగ్ గా మారాయి. నెటిజన్లు పాముల వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఒకవ్యక్తి తన మెడలో పామును వేసుకుని రచ్చ చేస్తున్నాడు. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఒక వ్యక్తి శివయ్య మెడలో పాము ఎలా అయితే ఉంటుంతో అచ్చం అలాగే పామును తన మెడలో వేసుకున్నాడు. అంతే కాకుండా అందరి ముందు పాముతో పాటుగా జనాల మధ్యలో వచ్చాడు.
మరీ పాము అతడి చుట్టుకుందో లేదా.. అతనే పామును మెడ దగ్గర పెట్టి దాన్ని కదలకుండా ఏదైన తాడులేదా రబ్బర్ తోచుట్టేశాడో తెలీదు కానీ.. మొత్తంగా పాము మాత్రం అతని మెడ దగ్గర తెగ హల్ చల్ చేస్తుంది. అది బుసలు కొడుతూ రచ్చ చేస్తుంది.
అతను మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా... నాకేంటీ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వీడేంట్రా ఇలా వైలెంట్ గా ఉన్నాడంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.