Married woman poison in coffee to kill husband in up: ఇటీవల కాలంలో చాలా మంది భర్తలు కట్టుకున్న తమ భార్యల వేధింపులు భరించలేక తరచుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు మహిళలు, వేధింపులకు గురయ్యే వారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మహిళలు అన్నిరంగాల్లో పురుషులకు సమానంగా రాణిస్తున్నారు.. మరీ వేధింపులలో కూడా ఎందుకు పోటీ ఇవ్వకూడదని అనుకున్నారో ఏంటో కానీ.. ఇటీవల కట్టుకున్న భార్యలు తమ భర్తల్ని రాచి రంపాన పెడుతున్నారు. భార్యల వేధింపులు భరించలేక ఎంతో మంది భర్తలు వీడియోలు తీసుకుని మరీ సూసైడ్ లకు పాల్పడ్డారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఇటీవల ఒక భార్య, తన లవర్ మోజులో పడి భర్తను చంపి డ్రమ్ లో వేసిన ఘటన దేశంలో సంచలనంగా మారింది.ఈ ఘటన మరువక ముందే అదే యూపీలో మరొ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాధ్ లో అనూజ్ శర్మ అనేక వ్యక్తి.. పింకీ అనే యువతిని రెండెళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి వీళ్ల మధ్యలో తరచుగా గొడవలు వచ్చాయి. దీంతో దంపతులు పలు మార్లు పంచాయతీలు పెట్టుకున్నారు.
అయితే.. పెద్దలు ఎంత చెప్పిన కూడా వీళ్లు తమ పద్దతి మార్చుకోలేదు. సదరు మహిళకు మరో యువకుడితో ఎఫైర్ ఉందని విషయం బైటపడింది. అత్తింటి వాళ్లు దీన్ని మార్చుకొవాలని పలు మార్లు హెచ్చరించారు . ఇటీవల కూడా ఇదే విషయంలో దంపతులు మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో తాజాగా.. పింకి తన భర్తతో గోడవ పడి వారం క్రితం ఇంటికి వెళ్లింది. ఆమె రెండు రోజుల క్రితం మరల అత్తింటికి వచ్చింది.క భర్త తాగుతున్న కాఫీలో విషం కల్పి రాత్రి ఇచ్చింది. అది తాగగానే.. అతను వాంతులు చేసుకుని, మూర్చబోయాడు.
వెంటనే అతడ్ని ఆమె చెల్లెలు ఆస్పత్రికి తరలించింది. వైద్యులు టెస్టులు చేసి విష ప్రయోగం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. సదరు బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు. అనూజ్ శర్మ కోలుకున్నాక.. అతని స్టేట్ మెంట్ రికార్డు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పింకి పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









