Wife Warning Video: బిడ్డా.. నరికి డ్రమ్ లో వేస్తా.. కొట్టుకుంటూ భర్తకు వార్నింగ్ ఇచ్చిన భార్య.. వీడియో వైరల్..

Uttar Pradesh: గోండా పరిధిలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మరో భార్య తన భర్తను కొట్టుకుంటూ రచ్చ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 31, 2025, 06:47 PM IST
  • యూపీలో రెచ్చిపోయిన మరో భార్య..
  • చంపి ముక్కలు చేస్తానంటూ వార్నింగ్..
Wife Warning Video: బిడ్డా.. నరికి డ్రమ్ లో వేస్తా.. కొట్టుకుంటూ భర్తకు వార్నింగ్ ఇచ్చిన భార్య.. వీడియో వైరల్..

Uttar pradesh goda wife harassed husband video: ఒకప్పుడు భర్తలు కట్టుకున్న తమ భార్యల్ని వేధించేవారు. వరకట్న వేధింపులు, అందంగా లేదని భార్యను ఏడిపించేవారు. మరికొందరు భార్యల్ని టార్చర్ లు పెట్టేవారు. కానీ ప్రస్తుతం మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు.  మరీ వేధింపుల విషయంలో ఎందుకు పోటీకీ రావద్దని అనుకున్నారో ఏంటో కానీ.. ఇటీవల చాలా చోట్ల భార్యలు .. తమ భర్తల్ని వేధిస్తున్నారు. కట్టుకున్న తమ ఇల్లాలి వేధింపులు భరించలేక చాలా చోట్ల భర్తలు.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల సెల్పీ వీడియోలు తీసుకుని మరీ భర్తలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి.

Add Zee News as a Preferred Source

ఇక మీరట్ లో ప్రియుడి మోజులో భార్య.. భర్తను అత్యంత క్రూరంగా హతమార్చి డ్రమ్ లో కుక్కిన ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో భర్తల మనుగడపైనెట్టింట ఆందోళనలువ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. యూపీలోని గోండాలో మరో షాకింగ్ ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

 

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఝాన్సీకి చెందిన జూనియర్ ఇంజనీర్ (జేఈ) ధర్మేంద్ర కుష్వాహ, గోండాలోని జల్ నిగమ్‌లో పనిచేస్తున్నాడు. 2016లో బస్తీ జిల్లాకు చెందిన మాయా మౌర్యను ను లవ్ మెరేజ్ చేసుకున్నాడు. కూతురు పుట్టాక.. మూడు వాహనాలు కొన్నాడు. అదే విధంగా తన భార్య పేరుతో కొంత భూమిని కొన్నాడు. ఆ  ఇంటి కాంట్రక్ట్ ను తన భార్య బంధువుకు ఇచ్చాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య సీక్రెట్ యవ్వారం స్టార్ట్ అయ్యింది. నీరజ్  భార్య కరోన కాలంలో చనిపోయింది. 

మరోవైపు 2024 జూలై 7న భార్య మాయ, నీరజ్‌ అభ్యంతరకర స్థితిలో ఉండటం తాను చూసినట్లు ధర్మేంద్ర ఆరోపించాడు. తన భార్యను నిలదీయగా.. ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. మళ్లీ ఆగస్టు మాసంలో వచ్చి.. తన ఇంటి తాళం పగల కొట్టి.. బంగారం, డబ్బు తీసుకుని పారిపోయిందని చెప్పాడు. ఈక్రమంలో తాను పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు వెల్లడించాడు.
 మార్చిలో సదరు భార్య, ఆమె ప్రియుడు తన తల్లిని కొట్టారని భర్త ధర్మేంద్ర పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేశాడు.

Read more: Lion Video Viral: ఏంగుండెరా వాడిదీ.. ఏకంగా సింహం తోకను పట్టుకుని మరీ.. షాకింగ్ వీడియో వైరల్..

ప్రియుడితో, తన భార్యతో ప్రాణహనీ ఉందని పోలీసుల ఎదుట వాపోయాడు. కానీ భార్య మాత్రం తనను వేధిస్తున్నాడని.. రివర్స్ లో మహిళ పీఎస్ లో కంప్లైట్ ఇచ్చింది.
ఈ క్రమంలో తాజాగా.. భార్య ఇంటికి వచ్చి కొడుతూ.. డ్రమ్ లో కుక్కి వేస్తానని బెదిరించిందని భర్త వాపోయాడు.ఆ వీడియోను పోలీసులకు ఇచ్చాడు. ఈ క్రమంలో.. వీరి వ్యవహరం..కోర్టులో ఉందని పోలీసులు వెల్లడించారు. కానీ మీరట్ ముస్కాన్ తరహాలో మాత్రం మహిళ తన భర్తకు వార్నింగ్ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News