Navy office murder case muskan kisses cop deepfake video: ఉత్తర ప్రదేశ్ లో నేవీ అధికారి సౌరభ్ రాజ్ పూత్ ను కట్టుకున్న భార్య ప్రియుడి మోజులో పడి అత్యంత క్రూరంగా హతమార్చింది. కూతురు పుట్టిన రోజును సెలబ్రేట్ చెద్దామని వచ్చిన భర్తను అన్నంలో మత్తుకలిపి పెట్టింది. అంతేకాకుండా.. భర్త అపస్మారక స్థితికి వెళ్లిపోయాక.. ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం భర్తను, ప్రియుడు సాహిల్ తో అత్యంతో క్రూరంగా హతమార్చి ఆ తర్వాత బాడీని రెండు ముక్కలుగా చేసింది. భర్త గుండెల మీద ఇష్టమున్నట్లు పొడిచింది.
ఆ తర్వాత భర్త డెడ్ బాడీని ఒక డ్రమ్ కొనుగోలు చేసి దానిలో పడేసి.. సిమెంట్ తో డ్రమ్ ను మూసేశారు. ఆ తర్వాత భర్తను చంపిన ఆనందంలో హోలీ ఆడుతూ రెచ్చిపోయారు. నేవి అధికారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. విచారణ చేపట్టగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ముస్కాన్, సాహిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ముస్కాన్, సాహిల్ లు జైల్లో తమకు డ్రగ్స్ కావాలని, ఫుడ్ వద్దని కూడా అక్కడున్న వాళ్లతో వాగ్వాదంకు దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో ముస్కాన్ కు సంబంధించి ఒక షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ముస్కాన్ జైలులో ఒక పోలీసును కిస్ చేసుకున్ను వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు షాక్ కు గురయ్యారు. ఇది కాస్త పోలీసుల వరకు వెళ్లింది . ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేపట్టారు.
మీరట్ బ్రహ్మపురి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ ఒకరు.. ప్రియాన్షురాక్స్_31 అనే ఇన్‌స్టా ఐడీ యూజర్ మీద ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాడు. తన పరువు తీయడం కోసమే కావాలనే ఏఐ జనరేటెడ్ వీడియను క్రియేట్ చేసి వైరల్ చేశారని సదరు ఎస్ఐ తన ఫిర్యాదులోపేర్కొన్నాడు. ఏఐ టెక్నాలజీతో డీఫ్ ఫెక్ వీడియోను తీసి వైరల్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
Read more: Nagarkunool woman Gangrape: ఉగాది రోజు ఘోరం.. దైవదర్శనానికి వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్..
ఈ నేపథ్యంలో.. మీరట్ ఎస్‌పీ ఆయుష్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని కచ్చితంగా అరెస్ట్ చేస్తామని హెచ్చరించాడు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు.ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









