)
Slate Pencils Eating Viral Video: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ఇందులో అనేక రకాల వీడియోలు, కంటెంట్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఎక్కువగా వైరల్ వీడియోలకు ప్రత్యకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. వైరల్ అనగానే చాలా మంది పాము వీడియోలు, ఫన్నీ వైరల్ వీడియోల గుర్తుకు వస్తాయి. కానీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే నిజంగా "వామ్మో" అనిపించేలా ఉంటాయి. అందులో ను వింతైన విషయాలు తెగ వైరల్ అవుతాయి. ఈ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
బలపాలు బాల్యంలో చాలామందికి తీపి గుర్తులు. వాటిని తిన్నవాళ్లు చాలామందే ఉంటారు. అవి తియ్యగా, వింతగా ఉండే రుచిని కలిగి ఉంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బలపాలు తినే వీడియోలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. వీటిని ASMR (Autonomous Sensory Meridian Response) వీడియోలుగా పిలుస్తారు. ఈ వీడియోలలో బలపాలు తినేటప్పుడు వచ్చే శబ్దాలు, వాటిని నమిలే విధానం, వాటిని తినేటప్పుడు కలిగే అనుభూతిని చూపిస్తారు. ఈ వీడియోలు చూసేటప్పుడు చాలా మందికి ఒక విధమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే శబ్దాల వల్ల కలిగే అనుభూతి చాలా మందిని ఆకర్షిస్తుంది. బలపాలు తినడం అనేది వింతైన అనుభూతిని కలిగిస్తుంది. కొందరు ఈ వీడియోలను చూసి ఆశ్చర్యపోతారు, మరికొందరు ఆసక్తిగా చూస్తారు. బలపాలు తినడం అనేది చాలా మందికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఈ జ్ఞాపకాల వల్ల కూడా చాలా మంది ఈ వీడియోలను చూస్తారు.
@asmrnehathedon అనే యూట్యూబ్ ఛానెల్ లో ఓ యువతి బలపాలను పల్లి బఠానీ లా తింటూ ఉంటుంది. ఈ వీడియోలో ఒక గుడ్డపైన ఒకటి నుంచి పది అంకెల ప్రకారం బలపాలను అమర్చి ఉంటాయి. వాటిని ఆమె 08 నిమిషాల్లో తినడం పూర్తి చేస్తుంది. ఆమె అలా బలపాలను తినడంతో నెటిజన్లు షాక్‌కు గురి అవుతున్నారు. ఈ వీడియోకు 1.8 మిలియన్ వ్యూస్ ఉండటం పెద్ద విషయం. ఈ వీడియో చూసిన కొంతమంది తమ చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని కామెంట్సా చేయగా.. మరి కొందరూ షాక్ అవుతున్నారు. ASMR వీడియోల వల్ల మెదడులో ఒక రకమైన ప్రతిస్పందనను కలిగిస్తాయి. దీనివల్ల శరీరం, మనస్సు రిలాక్స్ అవుతాయి మరి కొందరూ భావిస్తున్నారు.
చాలా మంది నెటిజన్లు ఈ వీడియోలు చూసి పిల్లలు కూడా బలపాలు తినడం అలవాటు చేసుకోవచ్చు.
బలపాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ వీడియోలు చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఈ వీడియోలు చూడకుండా చూడటం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి