)
Viral Video Of Aghori: లేడీ అఘోరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. సనాతన ధర్మం పేరిట హల్చల్ చేయడం.. అనంతరం ఓ యువతితో ప్రేమ, వివాహం.. తర్వాత జైలుకెళ్లడంతో అఘోరీ వ్యవహారం ముగిసింది. అయితే ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత మళ్లీ అఘోరాలు హల్చల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు అఘోరాలు అర్ధరాత్రి పూజలు చేశారు. యాగంతోపాటు పూజలు చేయడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలోని గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో సోమవారం ఇద్దరు అఘోరీలు పూజలు చేశారు. అఘోరి శ్రీనివాస్, అఘోర శాలిని ఇద్దరు కలిసి యాగం, పూజలు చేశారు. రాత్రి పూట భయంకరంగా పూజ చేయడంతో అక్కడి స్థానికులు భయాందోళన చెందారు. అయితే స్థానికుల మేలు కోసం పూజలు చేశామని అఘోరీలు తెలిపారు. తాము పది సంవత్సరాలుగా అగోరి విద్యని సాధన చేస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు. రెండు నెలలగా అగోరి సాధన చేస్తున్నట్లు శాలిని అఘోర వెల్లడించారు.
అఘోర పూజల నేపథ్యంలో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు మంచి జరిగేది లేకపోయినా.. చెడు జరిగేటటువంటి పరిస్థితి ఉందంటూ స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శివాలయం నుంచి ఈ అఘోరిలను పంపించి వేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. తెల్లవారుజామున స్థానికుల ఆందోళనతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. స్థానికుల ఆందోళనతో అక్కడి నుంచి అఘోరిలను పంపించి వేశారు. స్థానికుడు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వారితో పూజలు చేయిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వ్యవహారం గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో అఘోరీ శ్రీనివాస్ హల్చల్ చేయగా.. ఇప్పుడు మళ్లీ ఇద్దరు అఘోరీలు రావడం కలకలం రేపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.