Viral Video: మృత్యుంజయుడురా మావ.. రైలు ఢీకొట్టినా లేచి నడిచివెళ్లాడు, షాకింగ్ సీసీటీవీ ఫూటేజ్‌

Drunk Man Miraculous Train Escape Video: పెరూ దేశం రాజధాని లీమాలో అద్భుతం జరిగింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో రైలు పట్టాలపై నిద్రపోయాడు. అంతలోనే గూడ్స్‌ రైలు అతనిపై నుంచి వెళ్లింది. అయినా కానీ అతను మృత్యుంజయుడులా లేచి నడుచుకుంటూ వెళ్లాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది ఎలా జరిగిందో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Mar 10, 2025, 07:34 AM IST
Viral Video: మృత్యుంజయుడురా మావ.. రైలు ఢీకొట్టినా లేచి నడిచివెళ్లాడు, షాకింగ్ సీసీటీవీ ఫూటేజ్‌

Drunk Man Miraculous Train Escape Video: సాధారణంగా బైక్‌, కారు ప్రమాదాలు జరిగితేనే ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ, ఓ వ్యక్తికి ఏకంగా రైలు మీద నుంచి పోయింది అయినా కానీ లేచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. నిజానికి అయితే, రైలు ఢీకొంటే ఆ మనిషి ముక్కలవ్వడం ఖాయం. అయితే దానికి విరుద్ధంగా పెరూ రాజధాని లీమాలో జరిగింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా రైలు పట్టాపై తల పెట్టుకొని గాఢ నిద్రలో జారుకున్నాడు. అతని మీద నుంచి ఓ గూడ్స్‌ రైలు వెళ్లింది. కానీ ఇక్కడ అద్భుతం జరిగింది అతడు మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయి.. మృత్యుంజయుడురా మావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Add Zee News as a Preferred Source

ఈ వీడియో కొద్ది సమయానికే వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అతడు గమనించకుండా ఏకంగా రైలు పట్టాలపై తలపెట్టి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ధ్రువీకరించారు. అయితే నమ్మశక్యం కాలేని వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అసలు కదలకుండా రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేవడానికి ప్రయత్నించే సమయంలోనే రైలు అతని నుంచి వెళ్లింది. ప్రాణాలకు ఏ ప్రమాదం జరగలేదు కానీ, కాస్త గాయాలు అయినట్టు తెలుస్తుంది. కానీ మళ్ళీ లేచి నడిచి వెళ్తాడు 

స్థానిక రైల్వే అధికారుల వివరాల ప్రకారం 28 ఏళ్ల సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు. అయితే అతను రైలు వస్తున్న విషయాన్ని గమనించ లేదు. అయితే అతనికి రైలు శబ్దం కూడా వినిపించలేదా అనే విషయం తెలీదు.. స్వల్ప ప్రమాదంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఎడమ చేతి వేళ్లకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. రైలు ఢీకొట్టిన వెంటనే అతను లేచి ముందుకు వెళ్లి కింద పడిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లేచి ముందుకు నడిచాడు . ఇక ఘటన స్థలానికి వెంటనే వైద్య బృందం కూడా చేరుకుని అతని ఆసుపత్రికి తరలించింది. 

ఇదీ చదవండి: Tirumala: శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం.. తొలిరోజు శ్రీ సీతరామలక్ష్మణ ఆంజనేయుల తెప్పపై విహారం..

అయితే సదరు రైల్వే అధికారులు మాత్రం ఆ వ్యక్తి ఎవరో చెప్పలేదు కానీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి ప్రజల అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది. రైలు పట్టాల చుట్టుముట్టు ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడితే వేరేలా ఉండేది. అత్యంత జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. అయితే కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. లక్కీ పర్సన్.. ఇంకా వీడికి భూమి మీద నూకలు ఉన్నాయి. మద్యం మత్తులో రైలు పట్టాలపై పడుకున్న ఎంచక్కా ప్రాణాలతో బయటపడ్డాడు అంటూ నెట్టిజెన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చదవండి:  ఈరోజు రాశిఫలాలు.. సోమవారం ఈ రాశికి కలిసి వస్తుంది, వీళ్లు కొత్తపనులు మానుకోవాలి..  

 

 

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్- https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News