)
Mongoose And Snake Games Video Watch Now: పాముతో పాటు ముంగిసకు మధ్య సంబంధాలకు సంబంధించిన అనేక సమెతలను మనం తరుచుగా వింటూ ఉంటాం.. అంతేకాకుండా అప్పుడప్పుడు మనం తరచుగా సోషల్ మీడియాల్లో కూడా వీటి రెంటింటికి సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటాం.. అయితే, తాజా కూడా పాము, ముంగిసకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ వీడియోలో ఏం జరిగింది? ఈ పాము, ముంగిసల్లో ఏది గెలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం..
రోడ్డుపై నాగుపాముతో పాటు ముంగిస ఒకదానికొకటి దాడి చేసుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలోని హటాలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే, వీటి రెండింటి మధ్య జరుగుతున్న ఘర్షనను చూసేందుకు రోడ్డ దగ్గరి ప్రజలు పెద్ద ఎత్తున తరిలి వచ్చారు. దీంతో పాటు అక్కడ కొద్దిసేపు రాకపోకలు కూడా నిలిచిపోయా.. అంతేకాకుండా చాలా మంది ఈ సమయంలో వీడియోలు కూడా తీస్తూ అక్కడే ఉండిపోయారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక రోడ్డుపై అత్యంత ప్రమాదకరమైన నాగుపాముతో పాటు ముంగిసను చూడొచ్చు.. అయితే, ఈ వీడియోలో ముంగిస నాగుపాము పడగపై దాడి చేయడం మీరు గమనించవచ్చు. ముంగిస నాగుపామును ఒక్కసారిగా దాడి చేయడంతో.. అది భయపడిపోయింది. అంతేకాకుండా ఆ ముంగిస అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది. పాము వెనక్కి తిరిగి చూడడంతో ముంగిస మళ్లీ వెనక్కి వెళ్లి మరి దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది..
ఈ దాడి నడి రోడ్డుపై జరగడంతో దీనిని చూసేందుకు వాహనదారులు అక్కడే ఉండిపోయారు. అంతేకాకుండా కొంతమంది స్థానికులు కూడా అక్కడి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదే సమయంలో కొంతమంది ఘటను స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించి.. పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను ఓ సోషల్ మీడియా ఫ్లాట్ఫాన్ నుంచి పోస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి