Mongoose Vs Cobra Video: 3 కింగ్‌కోబ్రాలను లొంగదీసుకున్న ముంగిస.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

Mongoose Vs King Cobra Viral Video: తాజాగా అత్యంత ప్రమాదకరమైన మూడు పాములతో ముంగీస తలపడి విజయం సాధించిన దృశ్యాలు ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో మూడు ప్రమాదకరమైన పాములతో ముంగీస ఉండడం గమనించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 5, 2025, 06:32 PM IST
Mongoose Vs Cobra Video: 3 కింగ్‌కోబ్రాలను లొంగదీసుకున్న ముంగిస.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

Mongoose Vs King Cobra Viral Video Watch: పాములు ఎక్కువగా భయపడే జీవుల్లో ముంగిసలు ఒకటి. అత్యంత ప్రమాదకరమైన పాములను సైతం ముంగిసకు లొంగ తీసుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ పాము పై ఇది దాడి చేసిన తప్పకుండా విజయం సాధించగలుగుతుంది. అంతేకాకుండా ఇది శక్తివంతమైన జీవిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ముంగిస నాగుపాములపై సైతం ఎంతో సులభంగా దాడి చేయగలుగుతుంది. అందుకే ఈ రెండు జీవులు ఒకదానికి ఒకటి ఎదురెదురు పడితే తప్పకుండా దాడి చేసుకుంటాయి. అలాగే ఈ రెండు జీవులను ఒకదానికొకటి శత్రువులుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇవి ఎక్కువగా పాములు ఉన్నచోట మాత్రమే జీవిస్తూ ఉంటాయి. 

Add Zee News as a Preferred Source

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పాములతో పాటు ముంగిసలకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌గా మారుతూ ఉంటాయి. ఈ వీడియోలో ఎక్కువగా ముంగిస పాములను వెంటాడుతూ దాడి చేయడం. అలాగే అప్పుడప్పుడు ముంగిస పై కొన్ని పాములు కలిసి దాడి చేయడం వంటి వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా ముంగిస ఎప్పుడు పాముల దాడుల్లో అంతిమ విజయం సాధిస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒకే చోట మూడు పాములతో కలిసి ముంగిస కనిపించడం మీరు చూడొచ్చు. అలాగే ఆ ముంగిస కూడా మూడు పాములను భయపెడుతున్న దృశ్యాలు కళ్ళకు కట్టినట్లు మీరు క్లియర్ గా చూడొచ్చు. అయితే మూడు పాములతో పాటు ముంగిస తలపడి విజయం సాధించినందుకు గాను.. ఆ పాములు దానికి దొరకకుండా పారిపోవడం వీడియోలో  చూడొచ్చు. అంతేకాకుండా ఆ ముంగిస కూడా మూడు అతి పొడవైన పాములను తరిమికొట్టడం, అలాగే బిగ్గరగా అరుస్తూ కనిపించడం మీరు ఎంతో క్లియర్ గా చూడొచ్చు. 

Also Read: King Cobra Video: కింగ్ కోబ్రా తలపై ప్లాస్టిక్ డబ్బా పెట్టి.. ఏం చేస్తున్నారో మీరే చూడండి..

సాధారణంగా ముంగిసలు అత్యంత చిన్న పాములతో తలపడవు.. అలాంటిది ఈ వీడియోలో ముంగిస ఎంతో చిన్నమైన పాములతో తలపడుతున్నట్లు కనిపించడం మీరు గమనించవచ్చు. ఏది ఏమైనా మూడు పాములతో దాడికి దిగి ముంగిస విజయం సాధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను స్నేక్ క్యాచర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు దీనిని కొన్ని వందల మందికి పైగా వీక్షించారు.

Also Read: King Cobra Video: కింగ్ కోబ్రా తలపై ప్లాస్టిక్ డబ్బా పెట్టి.. ఏం చేస్తున్నారో మీరే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News