)
Monkey became a soft ware employee funny video: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా చాలా మంది ఫన్నీగా ఉండే వీడియోలు, ఆశ్చర్యంకు గురిచేసే వీడియోల్ని ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది తమ ఇంట్లో కుక్కలు, పిల్లులు పెంచుకుంటున్నారు. కొంత మంది కోతుల్ని కూడా పెంచుకుంటారు.
అయితే.. వీటిని కొన్ని పనుల్ని నేర్పిస్తారు. పాల ప్యాకెట్ , న్యూస్ పేపర్ తీసుకుని రావడం , కూరగాయల్ని తీసుకుని రావడం వంటి పనుల్ని నేర్పిస్తుంటారు. ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం. ఇటీవల కోతులు చపాతీలు చేయడం, బజ్జీల్ని వేయించడం, సెక్యూరిటీడ్యూటీ చేయడం వంటి వీడియోలు చూశాం.
మరీ ఇక్కడ దాని ఓనర్ కంప్యూటర్ మీద ఏదైన సాప్ట్ వేర్ అప్లికేషన్ నేర్చించాడో ఏంటో కానీ .. వానరం మాత్రం సిస్టమ్ ముందర కూర్చుని పెద్ద ఏదో వర్క్ చేస్తున్నట్లు తెగ బిల్డప్ లు ఇచ్చింది.
అంతేకాకుండా.. అది కళ్లజోడు కూడా పెట్టుకుని.. మధ్యలో దాన్ని సరిచేసుకుంటూ పెద్ద ప్రొఫెషనల్ వర్క్ మైండెడ్ అయినట్లు ఫోజులు ఇస్తు హల్ చల్ చేసింది. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కోతి పర్ఫామెన్స్ చూసి నోరెళ్ల బెడుతున్నారు. అసలుదాని టాలెంట్ మాత్రం భలే ఉందిగా ఉంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అది ఏఐ టెక్నాలజీతో తీసిన వీడియో అని నెటిజన్లు తమదైన స్టైల్లో రిప్లై లు ఇస్తున్నారు.