Monkey Video: ఎవడ్రా నువ్వు .. ఇది పెట్టావ్.!. నవ్వులు తెప్పిస్తున్న కోతి రియాక్షన్ .. వీడియో వైరల్..

Monkey funny video: కోతికి ఒక టూరిస్ట్ పెట్టింది తిని వెంటనే బైటకు ఉమ్మేసింది. ఇది పెట్టావ్ ఏంటని అన్నట్లు కోపంతో అతని వంక చూసింది.ఈ వీడియో వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 8, 2025, 08:27 PM IST
  • కోతికి గుడ్డు పెట్టిన టూరిస్టు..
  • మండి పడుతున్న నెటిజన్లు..
Monkey Video: ఎవడ్రా నువ్వు .. ఇది పెట్టావ్.!. నవ్వులు తెప్పిస్తున్న కోతి రియాక్షన్ .. వీడియో వైరల్..

Monkey gives funny reaction after smelling rotten egg video: కోతి చేష్టలు చాలా ఫన్నీగా ఉంటాయి.  ముఖ్యంగా ఒకప్పుడు గ్రామాల్లో కోతులు ఎక్కువగా కన్పించేవి. కానీ ఇప్పుడు పట్టణాల్లో కూడా కోతులు కన్పిస్తున్నాయి.  అడవులను క్రమంగా జనాలు ఆక్రమించడంతో అక్కడ ఉండే కోతులు పట్టణాల్లో, గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి.  దీంతో ఎక్కడ ఏది దొరికితే అది పట్టుకుని పారిపోతున్నాయి. అందుకే చాలా మంది కోతుల దాడులతో తెగ ఇబ్బందులు పడుతున్నారు.

Add Zee News as a Preferred Source

 

ఇటీవల కోతుల గుంపులుగా, గుంపులుగా వెళ్లి దాడులు చేస్తున్నాయి. కొన్నిసార్లు కోతులు చాలా ఫన్నీగా ప్రవర్తిస్తాయి. అవి మనం తినే ఆహర పదార్థాల్ని తింటాయి. కొన్నిసార్లు చెడుగా ఉండే పదార్థాల్నివాటికి ఇస్తే తినకుండా బైట ఉమ్మేస్తాయి. ఈ క్రమంలో ప్రస్తుతం టూరిస్టు ఒక కోతికి పాడైపోయిన కోడి గుడ్డు ఇచ్చాడు.

అది చేతిలో తీసుకుని తినేపదార్థం అని తీసుకుని నాట్లో వేసుకొవాలని చూసింది. ఇంతలో భరించలేనంతగా దుర్వాసన వచ్చింది. పాడైపోయినగుడ్డు నుంచి భరించలేని వాసన వస్తుంది. కోతి కూడా అచ్చం మనుషుల్లానే ఆ వాసనను భరించలేక.. నాలుక బైటకు తీసి మరీ ఛీ.. ఛీ అన్నట్లు ప్రవర్తించింది. దాని భాషలో టూరిస్టును కోతి బండ బూతులు తిట్టినట్లు అతనివైపు చూసింది.

Read more: Cobra Snake Video: వామ్మో.. బుసలు కొడుతూ అడవిలో పడగ విప్పిన భారీ నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..

 మొత్తంగా కోతి ప్రవర్తనను అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన కొంత మంది నెటిజన్లు నవ్వుకుంటే మరికొంత మంది మాత్రం మూగ జీవాల పట్ల ఇలాంటి పనులు చేయోద్దని సీరియస్అవుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News