)
Monkey Stared doing yoga after seeing the girl yaga asan funny video: కోతులు చాలా ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. ఒకప్పుడు గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పట్టణాలల్లో కూడా కోతుల రచ్చ ఉంటుంది. ముఖ్యంగా కోతులు ఇళ్లలోకి చోరబడి అందిన వస్తువుల్ని లాక్కెళ్లిపోతున్నాయి. ఏ మాత్రం నెగ్లీజెన్సీగా ఉన్న జనాల మీద దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది కోతుల బాధలతో తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Monkey with yoga.. 🐒😆 pic.twitter.com/CXVhb5gq2U
— Nature & Animals🌴 (@naturelife_ok) October 26, 2025
కోతులు , కొండెంగలు కొన్నిసార్లు చాలా ఫన్నీగా ప్రవర్తిస్తాయి. అవి మనబట్టల్ని ఎత్తుకునిపోతాయి. ఆహారంను తీసుకొని వెళ్తు ఆటపట్టిస్తుంటాయి. కళ్ల ముందే రెండు కాళ్లతో నడుస్తు, వెక్కిరించినట్లు ప్రవర్తిస్తాయి. అందుకే ఎవరైన కొంచెం కొత్తగా ప్రవర్తిస్తే.. కోతిలా ఆ ప్రవర్తన ఏంటని చాలా మంది ఫన్నీగా అంటు ఉంటారు.
అయితే.. ఇక్కడోక కొండెంగ చాలా విచిత్రంగా ప్రవర్తించింది. యువతి బంగ్లా మీద ఎక్కి ఏంచక్కా యోగా ఆసనాలు వేస్తుంది. మరీ దూరంగా ఒక కొండెంగ ఆమెను చూసింది. మరీదానికి కూడా యోగా చేయాలని అన్పించిందో ఏంటో కానీ.. అచ్చం అమ్మాయిలా యోగా చేసింది. అమ్మాయిలా తన కాళ్లను కూడా గాల్లో పైకి ఎత్తి తనచేతులతో పట్టుకుంది.
అంతటితో ఆగకుండా అమ్మాయివైపు చూస్తు ఫన్నీగా ఫోజులు ఇచ్చింది. ఆ యువతిని కొండెంగ భలే ఆటపట్టించింది. అక్కడున్న వారుఈ ఘటనను తమ ఫోన్ లలో రికార్డు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వావ్.. కొండెంగ భలే యోగా చేస్తుందంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది అది యోగా గురువుల జాబ్ లకు ఎసరు పెట్టినట్లుందని కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.