)
Monkey steals money bag and climbs on tree in prayag raj: సాధారణంగా కోతుల చేష్టలు చాలా ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా గ్రామాల్లో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ఇటీవల పట్టణాలకు కూడా కోతులు వచ్చేశాయి. కోతులు గ్యాంగ్ లుగా తిరుగుతు పోరపాటున ఎక్కడైన డోర్ లు ఓపెన్ గా ఉన్నా.. ఏదైన బ్యాగ్ లు ఏది దొరికితే అది పట్టుకుని పారిపోతున్నాయి.
ఏ మాత్రం నెగ్లీజెన్సీగా ఉన్న కూడా రచ్చ రంబోలా చేస్తున్నాయి. కొన్నిసార్లు కోతుల దాడుల్లో ప్రజలు గాయాల పాలైన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు కోతులు బైక్ ల మీదున్న బ్యాగులు, కవర్ లను ఎత్తుపోయిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. అచ్చం ప్రస్తుతం మరోసారి ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
प्रयागराज में मंगलवार को एक हैरान करने वाला नजारा देखने को मिला, जब एक बंदर ने अचानक 500-500 रुपये के नोटों की बारिश शुरू कर दी। बंदर ने तहसील परिसर में खड़ी एक बाइक की डिग्गी से बैग निकाला और पेड़ पर चढ़कर नोट उड़ाने लगा। #prayagraj #monkey pic.twitter.com/SVevHw8E2B
— Pawan Kumar Sharma (@pawanks1997) October 14, 2025
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గంగానగర్ జోన్‌లోని సోరాన్ తహసీల్‌లోని ఆజాద్ సభగర్‌లో జరిగింది. ఒక యువకుడు తన బైక్‌ను అక్కడ పార్క్ చేసి, ఒక భూమిని రిజిస్టర్ చేయడానికి తహసీల్‌కు వచ్చాడు. అయితే..తనతో పాటు ఉన్న డబ్బుల బ్యాగ్ ను బైక్ కవర్ లోనే మర్చిపోయాడు. అక్కడ చాలా కోతులు ఉన్నాయి. అందులో ఒక కోతి కవర్ ను చూసి అదేదొ తినే పదార్థం అనుకుంది. వెంటనే కవర్ పట్టుకుని చెట్టుపైకి ఎక్కేసింది.
ఇంతలో అతగాడికి బైక్ లోనే డబ్బుల కట్టలు మర్చిపోయానని బాధితుడికి గుర్తొచ్చింది. వెంటనే వచ్చి చూడగా.. అక్కడ పెద్ద రచ్చ నడుస్తొంది. ఒక కోతి బైక్ లోని డబ్బుల కవర్ ను తీసుకెళ్లి చెట్టుపైకి ఎక్కింది. డబ్బుల కట్టల్ని బైటకు తీసి కొరుకూతూ విచిత్రంగా ప్రవర్తించింది. కొన్ని నోట్ల కిందకు పడగా అక్కడి వారు తీసుకునేందుకు పోటీపడ్డారు.
బాధితుడు అది తన నోటు అని చెప్పడంతొ కొంత మంది ఆనోట్లను తిరిగి ఇచ్చారు. కానీ కోతి మాత్రం డబ్బుల కట్టుల్ని తినేందుకు తెగ ప్రయత్నాలు చేసింది. ఆ కవర్ లో 2 లక్షల వరకు నోట్ల కట్టలు, రూ. 500, 200,100ల రూపాయల నోట్లు దానిలో ఉన్నాయి. చాలా సేపు తర్వాత కోతి తన చేతిలోని నోట్ల కట్టల్ని పట్టుకుంది. కొన్నింటిని కొరికింది.
ఆతర్వాత కింద పడేసింది. దీంతో అతను వాటిని ఎంతో కష్టపడి తన నోట్లను అక్కడి వారి సాయంతో తీసుకున్నాడు. కొన్ని నోట్లను కొంత మంది తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఈక్రమంలో బాధితుడు తిరిగి తన డబ్బుల్నిఏరుకున్నాడు.ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook