Viral Video: వానరం బంపర్ డీల్.. నాక్కావాల్సింది ఇచ్చుకో.. నీక్కావాల్సిందీ తీసుకో.. వీడియో చూస్తే పడి పడి నవ్వడం పక్కా..

Monkey steals Samsung phone: వానరం సామ్ సంగ్ ఎస్ 25 మొబైల్ ను కొట్టేసింది. ఆ తర్వాత   అక్కడే ఉన్న గోడను ఎక్కి మరీ దాని ఓనర్ కు చుక్కలు చూపించింది. ఇంతలో అతను ఒక ట్రిక్ ప్లే చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 17, 2025, 03:38 PM IST
  • ఫోన్ ను ఎత్తుకుపోయిన కోతి..
  • వైరల్ గా మారిన ఫన్నీ వీడియో..
Viral Video: వానరం బంపర్ డీల్.. నాక్కావాల్సింది ఇచ్చుకో.. నీక్కావాల్సిందీ తీసుకో..  వీడియో చూస్తే పడి పడి నవ్వడం పక్కా..

Monkey steals Samsung s25 ultra video viral: సోషల్ మీడియాలో తరచుగా ఫన్నీ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కోతులు, పాములు, ఏనుగుల వీడియోలు ఇటీవల ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం వెరైటీ ఉన్న వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కోతులు ఒకప్పుడు అడవుల్లో ఎక్కువగా ఉండేవి.కానీ ఇప్పుడు మాత్రం అడవుల కంటే.. పట్టణాల్లో, గ్రామాల్లోనే ఉంటున్నాయి. గుంపులుగా తిరుగుతూ.. ఎక్కడ ఎలాంటి గ్యాప్ దొరికిన  కూడా వెంటనే ఇళ్లలోనికి దూరిపోతున్నాయి. అందిన వస్తువుల్ని కొట్టేసి సెకన్ల వ్యవధిలో అక్కడి నుంచి జంప్ అయిపోతున్నాయి.

Add Zee News as a Preferred Source

 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం  కోతులు ఇటీవల తమ పనులతో జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా కొత్త ప్రదేశాలను చూసేందుకు వస్తుంటారు . కొండ ప్రాంతాలు, చెట్లు ఎక్కువగా ఉన్న చోట వానరాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో పర్యాటకుల చేతిలో ఉన్న  ఏ వస్తువులనైన వానరాలు అవేంటో.. తినే వస్తువులు అనుకుంటాయి. దీంతో గుంపులుగా వెళ్లేసి..వాటిని తీసుకుని పారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వానరం ఏకంగా  ఒక పర్యాటకుడి నుంచి సామ్ సంగ్ ఎస్ 25 మొబైల్ ఫోన్ ను కొట్టేసింది.

దీంతో అతను.. లబోదిబో మన్నాడు. కోతి తీరిగ్గా అక్కడున్న ఒక గొడపైకి ఎక్కేసి... టూరిస్టుకు చుక్కలు చూపించింది. పాపం.. అతను తన ఫోన్ ఇవ్వాలని కోతికి ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంతలో అక్కడున్న వాళ్లకు కోతికి ఒక ట్రిక్ చెప్పాడు. దానికి ఇష్టమైన దాన్ని విసిరితే.. దాని చేతిలో ఉన్న మొబైల్ ను కిందకు పడేస్తుందేమొ అని అన్నారు. దీంతో అతగాడు.. ఇదే ట్రిక్ ప్లే చేశాడు. కోతి ముందర ఒక మ్యాంగో జ్యూస్ విసిరాడు.

Read more: Viral Video: ఎండలు బాబోయ్.. ఎండలు.. హ్యాండ్ బోర్ కింద సేదతీరుతున్న కోబ్రా స్నేక్.. వీడియో వైరల్..

అది కాస్త కోతి క్యాచ్ పట్టింది. ఆ తర్వాత వానరం..ఆ మ్యాంగోను తన చేతిలో తీసుకుని..దాని చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ను కింద పడేసింది. దీంతో అతగాడు హమ్మయ్యా.. నా ఫోన్ అయితే  దొరికిపోయిందోచ్ అని పండగ చేసుకున్నాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కోతి కూడా క్విడ్ కో ప్రో చేస్తుందీగా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News