Cute Little Monkey Kissing Video Watch Now: సాధారణంగా కోతులు ఒకచోట ఉండవు. ఎక్కువగా చిలిపి చేష్టలు చేస్తూ ఉంటాయి. అలాగే చెట్ల కొమ్మల పైనుంచి అటు ఇటు దూకుతూ కనిపిస్తూ ఉంటాయి. చెట్లకు ఉండే పండ్లు ఫలాలను ఆహారంగా చేసుకుని వాటి పైనే జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నీటి కోసం నేలపై అడుగుపెడుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే తరచుగా ఇప్పుడు ఇంటర్నెట్లో కోతులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. కొంతమంది పిల్లలు ఎక్కువగా కోతులకు సంబంధించిన వీడియోలు చూసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే కోతుల వీడియోలు షేర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్లో ఓ బేబీ కోతికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
తల్లి కోతులు పిల్ల కోతులను రక్షించుకునే క్రమంలో ఏవైనా చేయగలుగుతాయి. అంతేకాకుండా చెట్లనుంచి పడిపోతున్న పిల్ల కోతులను సైతం తన చేతులతో ఎంతో సులభంగా పట్టుకోగలుగుతాయి. అలాగే ప్రమాదకరమైన చెట్టు నుంచి పడిపోతున్న సమయంలో కూడా వెంటనే దూకి ఆ పిల్ల కోతులను పట్టుకొని ఇతర కొమ్మలపై వెళ్లగలుగుతాయి. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ పిల్ల కోతి చెట్టుకొమ్మ ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇదే సమయంలో తల్లి కోతి తన కాలును పట్టుకొని లాగింది.
తల్లి కోతి పిల్ల కోతి కాలు లాగడంతో ఆ చిన్న కోతి వెంటనే తల్లి ముఖంపైకి దూకి ముద్దు పెట్టుకుంటుంది. పిల్ల కోతి చాలా క్యూట్ గా ముద్దు పెట్టుకోవడంతో తల్లి కోతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ క్యూట్ సన్నివేశాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో సోషల్ మీడియా వినియోగదారులు పిల్ల కోతి ప్రేమను చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా మాత్రమే వైరల్ అవుతూ ఉంటాయి.
ఈ వీడియోను 'యెసిలోడక్' అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించగా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అయితే "తల్లి చిన్న వయసులోనే పిల్లకు క్రమశిక్షణ నేర్పుతోందని" కామెంట్లు రాస్తు వస్తున్నారు. మరి కొంతమంది అయితే ప్రపంచంలో అన్నిటికన్నా మించిన ప్రేమ ఈ పిల్ల కోతి దేనని చెబుతున్నారు. ఏది ఏమైనా పిల్లలు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









