Smart Monkey Viral Video: సాధారణంగా కోతులు ఎక్కువగా చెట్లపై తిరుగుతూ ఉంటాయి. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అడవుల్లో చెట్లు తగ్గిపోవడం వల్ల ఆహారం దొరకక జనావాసాల్లోకి సంచారం చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని కోతులు అయితే ఇళ్లలోకి మరీ వచ్చి ఆహార పదార్థాలు తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఇలా పల్లె ప్రాంతాల్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా కొన్నిచోట్ల పెంచుకున్న మొక్కలను కూడా నాశనం చేస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే పెంచుకున్న కోతుల విషయానికొస్తే.. అవి యజమానులు చెప్పిన మాటలు వింటూ ఉంటాయి.
ప్రస్తుతం చాలామంది పెంపుడు కోతులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని ఎక్కువగా జనాలు చూసేందుకు ఆసక్తి చెబుతున్నారు. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కోతి ఏం చేసిందో? ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
బంగ్లాదేశ్ లోని ఓ నగరంలో కోతి ఏకంగా మెడికల్ షాప్‌లోకి ప్రవేశించి.. చికిత్స ఇవ్వమని సైగలతో మెడికల్ సిబ్బందిని అడుగుతుంది. దీనిని క్యాచ్ చేసుకొని మెడికల్ సిబ్బంది.. గాయపడిన కోతికి యాంటిమేంట్ పూసి చికిత్స చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. కోతి నేరుగా మెడికల్ షాప్ కి వెళ్లి ఇలా చికిత్స చేయమని అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఇలా కొన్ని కోతులు మాత్రమే వాటి బాధను ఇతరులకు సైకలతో చెబుతాయని.. ఈ కోతి మాత్రం దెబ్బ తాకిన చోట చూపిస్తూ మరి, దానికి చికిత్స చేయమని కోరడం ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తుంది. అలాగే మెడికల్ సిబ్బంది కూడా ఏమాత్రం ఆ కోతికి భయపడకుండా చికిత్స చేయడం చూసి నెటిజన్స్ వారిని మెచ్చుకుంటున్నారు.
ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దీనిని @amarbanglaremati అని ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటివరకు దీనిని కొన్ని లక్షల మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీడియో ఎంతో ఆసక్తిగా ఉండడంతో చాలామంది దీనిని షేర్ కూడా చేశారు. ఇక ఇప్పటికి ఈ వీడియోకు మూడు వేలకు పైగానే లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసి నేటిజన్స్ వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.. "కోతులు మనసులతో సమానమని.. వాటికి కూడా చికిత్స చేయాలని" కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు. మరి కొంతమంది అయితే "ఈ ఘటన చూడడానికి హృదయాన్ని పిండేసితోందని" కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook