Monkeys gang enters haldi ceremony video viral: ఒకప్పుడు కోతులు అడవుల్లో ఎక్కువగా కన్పించేవి. కానీ ఇప్పుడు మాత్రం సీన్ అంతా రివర్స్ అయిపోయింది. కోతులు గ్రామాల్లో, పట్టణాల్లో తిరుగుతు రచ్చ చేస్తున్నాయి. పొరపాటున ఇంట్లో డోర్ లు పెట్టడం మర్చిపోతే.. ఇంకేంలేదు. కోతులు ప్రవేశించి నానా బీభత్సం చేస్తుంటాయి. కోతులు మూకుమ్మడిగా మనుషులపై దాడులు సైతం చేస్తున్నాయి. చాలా సందర్భాలలో కోతులు ఇళ్లలో దాడులు చేసి ఏదీ దొరికితే దాన్ని ఎత్తుకోని పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు కోతులు చేసే పనులు చూస్తే ఫన్నీగా అన్పిస్తుంటుంది.
మరికొన్నిసార్లు కోతుల పనులు చూస్తే వెన్నులో వణుకు కూడా పుడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. ఒక కోతి హల్దీ వేడుక జరుగుతున్న ప్రదేశంకు వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. అక్కడ మరి కొంత మంది ఒకరికి మరోకరు లడ్డులు తిన్పించుకుంటున్నారు.
Bro Saw the opportunity and Took it? pic.twitter.com/FGMTQwgSrX
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 25, 2025
ఇంతలో కోతి స్పీడ్ గా వెళ్లి వారిపైన దాడిచేసింది. అక్కడ ప్లేట్ లో ఉన్న లడ్డును అమాంతం తీసుకుని అక్కడి నుంచి మెల్లగా జరుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు వానరంను చూసి అరుపులు, కేకలు పెట్టారు. అంతే కాకుండా.. కోతులకు తమ దగ్గరున్న లడ్డులు తినేందుకు కూడా వేశారు.
మరికొందరు వావ్.. భలే పెళ్లికి అనుకొని విధంగా కోతులు అతిథులుగా హజరయ్యారని ఫన్నీగా చెప్పుకుంటున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కోతులతో జాగ్రత్త.. కొన్నిసార్లు దాడులు కూడా చేస్తాయని కూడా అంటున్నారు. మొత్తంగా ఈ కోతులు హల్దీ వేడుకలో ఎంట్రీ ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









