)
King Cobra In Plastic Container Video Watch: జనాభాసాల్లో వచ్చిన పామును సురక్షితంగా రెస్క్యూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.."అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్" అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాని పట్టుకుంటున్న సమయంలో తీసిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. సాధారణంగా చాలామంది పాములకు సంబంధించిన వీడియోలు ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జనవాసాల్లోకి వచ్చిన ఓ పెద్ద కింగ్ కోబ్రాని పట్టుకోవడానికి అక్కడికి చేరుకున్నాడు. వెంటనే అతను పాములు గమనించి దానిని ఓ డబ్బాలో బంధించాలని అనుకున్నాడు.. కానీ అతను అనుకున్న పని చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ పాము చాలా చురుకుగా ఉంది. డబ్బాను దాని తలభాగంలో పెట్టగానే ఒక్కసారిగా ఆ పాము తన వైపు దాడి చేసేందుకు వచ్చింది. దీంతో ఆ స్నేక్ క్యాచర్ వెంటనే ఆ పాము దగ్గర నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను మరోసారి ఆ పాముడి బంధించినందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో కూడా అది తనపై దాడి చేసే ప్రయత్నం చేసింది..
చివరగా ఆ స్నేక్ క్యాచర్ ఎంతో జాగ్రత్తగా పాము తలభాగంపై డబ్బును పెట్టి అందులో బంధించాడు. అది నెమ్మదిగా ఆ డబ్బాలకు దూరడంతో వెంటనే డబ్బా కున్న మూతను బిగించాడు. దీంతో ఆ పాము ఎలాంటి గాయాలు లేకుండా డబ్బాలోకి వెళ్ళింది. అయితే, ఈ ఘటనను చూసేందుకు అక్కడికి చాలామంది తరలివచ్చారు. పిల్లలతో పాటు కొంతమంది పెద్దలు పాముకు దూరంగా పామును పట్టుకుంటున్న దృశ్యాలను తిలకించారు. సాధారణంగా పల్లె ప్రాంతాల్లో ఇలా పాములు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి.. కొంతమంది వీటిని పట్టుకోకుండా దాడి చేసి చంపేస్తూ ఉంటారు. మరి కొంతమంది జంతు ప్రేమికులు స్నేక్ ప్యాచర్స్ లేదా వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందిస్తారు. ఏదేమైనా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. దీనిని రక్షించిన ఆ స్నేక్ క్యాచర్‌ను చాలామంది ప్రశంసిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook