Most Expensive Apple: దునియాలో అత్యంత ఖరీదైన యాపిల్.. దీని విలువ తెలిస్తే.. ఆశ్చర్యపోతారు!

Most Expensive Apple In Telugu: ప్రస్తుతం సోషల్ మీడియాలో యాపిల్‌కి సంబంధించిన ఫోటోలు వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ యాపిల్ చూడడానికి వజ్రాలతో నిండి ఉండడం చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 12, 2025, 11:37 AM IST
Most Expensive Apple: దునియాలో అత్యంత ఖరీదైన యాపిల్.. దీని విలువ తెలిస్తే.. ఆశ్చర్యపోతారు!

Most Expensive Apple In World:సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో ఆశ్చర్యాలు కలిగించే పోస్ట్లు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి ఇందులో భాగంగానే కొన్ని విలువైన అరుదైన వస్తువులకు సంబంధించినవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని పోస్టులలో వైరల్ అయ్యే సమాచారం ఫేక్ అవుతూ కూడా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మాత్రం పోస్ట్లు వైరల్ అవుతూ ఉంటాయి.. తాజాగా కూడా ఆశ్చర్యం కలిగించే పోస్టు వైరల్ అవుతుంది. అదేంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

సాధారణంగా తినే యాపిల్ రోడ్లపై ఒక్కొక్కటి పది నుంచి 20 రూపాయలు ఉంటుంది. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఆపిల్ ధర కొన్ని కోట్ల విలువ చేస్తుందంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. ముంబైకి చెందిన ప్రఖ్యాత స్వర్ణకారుడు రోహిత్ సీసల్ అత్యంత విలువైన వజ్రాలతో పాటు బంగారంతో యాపిల్ ని తయారు చేశాడు. దీని విలువ దాదా రూ.10 కోట్ల పైనే ఉంటుందని ఆయన తెలిపారు. సాధారణంగా ఇలాంటి షేపుల్లో తయారు చేయడం చాలా కష్టమైనప్పటికీ రోహిత్ తనకున్నకాలతో ఈ అద్భుతం సృష్టించాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

ఇది తినే యాపిల్ కాదని.. గృహాలంకరణలో భాగంగా పెట్టుకునేదని రోహిత్ తెలిపారు. దీనిని 36 సెంటు వజ్రాలతో తయారు చేశారు. ఇందులో దాదాపు చిన్నచిన్న వజ్రాలు 1900కు పైగానే ఉన్నట్టు ఆయన తెలిపారు. వీటి బరువు దాదాపు 29 గ్రాములు ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నో రోజులపాటు శ్రమించి ఈ వజ్రాలతో కూడిన యాపిల్‌ను తయారుచేసినట్లు ఆయన వివరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను రోహితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

Also Read: Realme Gt 8 Pro: 200MP టెలిఫోటో లెన్స్‌తో Realme నుంచి అదిరిపోయే మొబైల్.. లాంచ్‌ తేది, ఫీచర్స్‌ ఇవే!

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు వారు పరిశీలించి అరుదైన రికార్డులలో చేర్చా. అంతేకాకుండా వరల్డ్ ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ కూడా దీనిని ధ్రువీకరించింది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోల్లో ఈ యాపిల్‌ని చూస్తే అరుదైన వజ్రాలతో తయారుచేసినట్లు కనిపిస్తుంది. అయితే ఈ యాప్ ను థాయిలాండ్ లోని రాయల్ ప్యాలెస్ లో అతి త్వరలోనే ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Realme Gt 8 Pro: 200MP టెలిఫోటో లెన్స్‌తో Realme నుంచి అదిరిపోయే మొబైల్.. లాంచ్‌ తేది, ఫీచర్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News