)
Dog Driving Bike Video Watch Here: ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలైతే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కలకు సంబంధించిన కొన్ని వీడియోలు మానసిక వినోదాన్ని పంచుతూ సోషల్ మీడియా వినియోగదారుల మన్ననలు పొందుతున్నాయి. అయితే చాలామంది దీనిని దృష్టిలో పెట్టుకొని పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అయితే నేటిజన్స్ కూడా ఏమాత్రం ఆ వీడియోలను వదిలిపెట్టకుండా చూస్తున్నారు.
గతంలో వైరులైన వీడియోలో ఒక కుక్క తన యజమానితో కలిసి "హ్యాపీ బర్త్‌డే పాట" పాడిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ద్వారా కుక్కలు మనుషులతో ఎంత దగ్గరగా ఉంటాయో అనేది తెలిసి వచ్చింది. అంతేకాకుండా కుక్కలు ఎలాంటి పనులైన సులభంగా చేయగలగడమే కాకుండా.. మనుషులు చేసే కొన్ని అరుదైన పనులు కూడా చేస్తాయని ఈ వీడియో ద్వారా నిరూపితమైంది. మరో వీడియోలో ఒక కుక్క ఆకలితో ఉన్న చిన్నపిల్లలకి తన ఆహారాన్ని ఇచ్చి తినమని సైగలు చేస్తుంది. అంతేకాకుండా తినే వరకు పట్టు పట్టి ఆ కుర్రాడు దగ్గరనే ఉండిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా గతంలో వైరల్ అయింది.
తాజాగా ఇంటర్నెట్లో మరో కుక్కకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కుక్క ఫన్నీ ఫన్నీగా చేస్తోంది. సాధారణంగా మోటార్ సైకిల్స్ మనసులు నడపడమే చాలా కష్టం.. అలాంటిది ఈ వీడియోలో కుక్క హోండా మోటార్ సైకిల్ ని నడుపుతోంది. అంతేకాకుండా బ్యాలెన్స్ చేస్తూ మరి బైకును కొంత దూరం వరకు నడిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు లోకి వెళితే.. ఎరుపు రంగు టీ షర్టు, ఆకుపచ్చ డ్రాయర్ ధరించిన ఓ కుక్క బైక్ ఎక్కి హాయిగా పొలాల చిన్న రోడ్డు గుండా ముందుకు నడుపుకుంటూ వెళ్లడం మీరు గమనించవచ్చు..
అంతేకాకుండా ఈ వీడియోలో కుక్క చెప్పులు వేసుకొని.. ఒక హోండా కంపెనీ స్కూటర్‌ను నెమ్మదిగా తోలడం కూడా మీరు చూడొచ్చు. ఈ కుక్క పొలం గట్లపై నెమ్మదిగా ఎవరి సపోర్టు లేకుండా బైక్ నడుపుతోంది. ఇలా ఈ పెంపుడు కుక్క కొద్ది దూరం వరకు బైక్ నడిపేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ గా మారాయి. దీనికి సంబంధించిన వీడియో మీమ్బ్రెజిల్ 777 అనే ఇంస్టాగ్రామ్ కాదా నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోని 26,000 మందికిపైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా 41 వేల మందికిపైగా షేర్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి