King Cobra Video: జత కడుతున్న అతి ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలు.. వీడియో చూస్తారా?

King Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు కింగ్‌కోబ్రాలకు సంబంధించిన దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవి చేస్తున్న సయ్యాటలను చూసి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంతకీ ఈ వైరల్ అవుతున్న వీడియో ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 20, 2025, 05:59 PM IST
King Cobra Video: జత కడుతున్న అతి ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలు.. వీడియో చూస్తారా?

Venomous King Cobra Video: సాధారణంగా కింగ్ కోబ్రా పాములను ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు.. గిరిజన జాతికి చెందిన వారైతే గిరినాగులని, రాచనాగులని పిలుస్తూ ఉంటారు. కొంతమంది అయితే వీటిని అతి ప్రమాదకరమైన నాగుపాములని పిలుస్తారు. ఇవి సాధారణంగా జనావాసాల్లోకి చాలా అరుదుగా సంచారం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా జనం జోలికి పెద్దగా వెళ్లవు.. ఇవి ఎలాంటి హాని తలపెట్టవని కొంతమంది చెబుతూ ఉంటారు. సాధారణంగా గిరి నాగు పాములను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇవి ఎక్కువగా పెద్దపెద్ద అడవి ప్రాంతాల పక్కనే నివసించే వారి ఇళ్లలోకి సంచారం చేస్తూ ఉంటాయి. అయితే చాలామంది వీటిని రక్షించేందుకు స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పోస్ట్ చేస్తున్నారు. తాజాగా వీటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇప్పుడు వైరల్‌గా మారింది. 

Add Zee News as a Preferred Source

విశాఖ చుట్టుపక్కల్లో ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో తరచుగా పెద్ద పెద్ద పాములు సంచారం చేస్తూ ఉంటాయి. అందులో చాలావరకు అతి ప్రమాదకరమైన పాములే.. అయితే వీటిని  స్నేక్ క్యాచర్ రక్షించి, సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది. అనకాపల్లి జిల్లాలోని అడవికి దగ్గరగా ఉండే ఓ ప్రాంతంలో రెండు భారీ కింగ్ కోబ్రాలు హల్చల్ చేశాయి.. దీంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల ఉండే స్థానికులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం మారే పల్లిలో జరిగింది. 

గత రెండు మూడు రోజుల నుంచి 12 అడుగుల కింకోబ్రాలు స్థానికంగా తిరగడంతో రైతులు ఎంతో ఆందోళన చెందారు. అవి వారిపై ఎక్కడ దాడికి దిగుతాయోనని.. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే పాములకు వేసవికాలం జతకట్టే సీజన్ కావడంతో జనాభాసాల్లోకి సంచరించాయని కొంతమంది రైతులు భావించారు. అయితే ఒకరోజు ఓ కళ్ళం వద్ద ఉన్న పుట్టలోకి రెండు పాములు ప్రవేశించడంతో అక్కడే ఉండే ఫారెస్ట్ అధికారులు ఈస్ట్రన్ ఘాట్స్‌ వైల్డ్‌ లైఫ్‌ సొసైటీకి ఇన్ఫర్మేషన్ అందించారు. అయితే వారెక్కడికి చేరుకొని. రెండు గంటల పాటు బాగా శ్రమించి వాటిని పట్టుకొని సురక్షితమైన ప్రదేశాల్లో విడిచిపెట్టారు. 

వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు అక్కడి ప్రజలకు కొన్ని విషయాలు చెప్పుకు వచ్చారు. అడవుల్లో ఉండే పెద్ద పెద్ద పాములకు ఇది జతకట్టే సమయమని.. ఈ సమయంలో ఇలా సంచారం చేయడం చాలా సర్వసాధారణమని.. కొన్ని పాములు ఇతర పాములతో జతకట్టేందుకు వెతుకుతూ ఇలా జనావాసాల్లోకి సంచారం చేస్తాయని వారన్నారు. తరచుగా ఇలా జనాభాసాల్లోకి సంచారం చేస్తే తప్పకుండా వారికి సమాచారం అందించాలని కోరారు. ఇలా సంచారం చేసే పాముల పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. ముఖ్యంగా రైతులయితే ఈ వేసవి సమయంలో తప్పకుండా ఒకటికి రెండుసార్లు చూసుకుంటూ నడవడం మంచిదని వారన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News