Mother bird fight with venomous cobras snakes video: సోషల్ మీడియాలో పాముల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే భయకరంగాను, మరికొన్ని వీడియోలు చూస్తుంటే ఆశ్చర్యకరంగాను ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక పాము పక్షిపిల్లలపై దాడి చేసింది. దీంతో తల్లి ఆ కోబ్రా పాముతో ఫైటింగ్ కు దిగింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సైతం ఎమోషనల్ అవుతున్నారు.
సృష్టిలో తల్లి ప్రేమకు సాటి అయినది మరోకటి ఉండదు. అందుకే దేవతలు సైతం.. భూలోకంలో మానవ రూపంలో తల్లి కడుపులో పుట్టి అమ్మప్రేమను పొందారు. అయితే.. తల్లి ప్రేమ అనేది మనుషుల్లోనే కాదు.. నోరు లేని జీవాల్లో సైతం అలానే ఉంటుంది. సాధు జంతువులు అయిన క్రూర జంతువులు అయిన అవి తమ పిల్లల జోలికి వస్తే ఎంతకైన తెగిస్తాయి. తమకన్నా.. నాలుగు రెట్లు పెద్దజంతువులతో అయిన ఫైటింగ్ కు దిగుతాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం అడవిలో ఒక చెట్టు మీద పక్షి గూడులో గుడ్లుపెట్టింది . అందులో నుంచి పిల్లలు బైటకు వచ్చాయి. అయితే.. ఒక పాము ఆ గూడులోకి పిల్లల్ని తినేందుకు చెట్టుపైన పాకుతూ గూడు ఉన్న రంధ్రంలోకి ప్రవేశించింది. ఇంతలో తల్లి పక్షి అక్కడకు వచ్చి కోబ్రాతో గొడవకు దిగింది. ఆ పామును తన పిల్లలు ఉన్న గూడు నుంచి బైటకు వచ్చేదాక పోరాటం చేసింది. దీంతో పాము చెట్టు పై నుంచి కిందకు పడిపోయింది.
అయితే.. పాపం.. ఆ పక్షి పాముతో గొడవకు దిగి.. దాని కాటుతోనే చనిపోయింది. తన పిల్లల కోసం చివరి వరకు ఆ పక్షి చూపిన తెగువ అందర్ని కలిచి వేస్తుంది. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.









