Mother Dog Love Video: తల్లి ప్రేమ ఎంత గొప్పదో.. డాగ్ లవర్స్ తప్పకుండా చూడాల్సిన వీడియో..

Mother Dog Love Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ తల్లి కుక్క పిల్ల కుక్క పిల్లపై ప్రేమ చూపుతో నీటిలోకి దిగకుండా ఆపిన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జంతువుల మధ్య కూడా అసలైన ప్రేమ ఉంటుందని ఈ వీడియో నిరూపించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే వైరల్‌గా మారింది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 9, 2025, 05:18 PM IST
Mother Dog Love Video: తల్లి ప్రేమ ఎంత గొప్పదో.. డాగ్ లవర్స్ తప్పకుండా చూడాల్సిన వీడియో..

 Mother Dog Love Latest Video: తల్లి ప్రేమ స్వచ్ఛమైన పాలకంటే గొప్పది.. అమ్మ ప్రేమను వివరించడం చాలా కష్టం, ధర కట్టడం కూడా అంతకంటే పెద్ద కష్టం. ఆమె తన పిల్లల ఆనందం కోసం, చిరునవ్వు కోసం ఏదైనా చేస్తుంది. బాధలను సైతం మదిలో పెట్టుకొని పిల్లల ముందు చిరునవ్వు నవ్వుతుంది. అలాగే పిల్లల ఉన్నతి కోసం ఎంత కష్టాన్నైనా అనుభవిస్తుంది. పిల్లల కోసం అనునిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అందుకే తల్లి ప్రేమ ఎంతో గొప్పది. ఇలాంటి ప్రేమనే ఓ కుక్క తన పిల్లకు పంచిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Add Zee News as a Preferred Source

వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ చిన్న కుక్క పిల్ల నీటిలో ఆడుకుంటూ ఉండటం చూడొచ్చు. అయితే, దాని తల్లి పిల్లను నీటి లోపలికి వెళ్లకుండా ఎంతో జాగ్రత్తగా తోకను పట్టుకొని ఆపుతున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు చూడొచ్చు. అలాగే వెనక్కి రమ్మని తన నోటితో వెనకనుంచి కదపడం కూడా మీరు గమనించవచ్చు. ఈ అద్భుతమైన తల్లి ప్రేమకు సంబంధించిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులు చూసి ఫిదా అయిపోతున్నారు. సాధారణంగా మనుషులతో పాటు జంతువులు కూడా పిల్లల పట్ల సమానమైన ప్రేమను కలిగి ఉంటాయి. 

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే tv1indialive అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోలో తల్లి కుక్క పిల్లని ఎలా కాపాడిందో అనే అంశాన్ని క్లియర్‌గా తెలియజేస్తుంది. కుక్క పిల్ల నీటిలోకి వెళ్తున్న సందర్భంలో తల్లి నోటితో ఆపడం.. ఆ పిల్లతో ఒక పట్టుకొని వెనక్కి గుంజడం.. చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా మనుషుల్లోనే ఏమాత్రం ప్రేమలేని ప్రస్తుత కాలంలో.. జంతువుల మధ్య ఉన్న ప్రేమను చూసి ఫిదా అవుతున్నారు. 

 
 
 
 
 

Also Read: Baby King Cobra Video: దోసిలి నిండా నాగుపాము పిల్లలే.. పడగలు విప్పి ఎలా ఆడుతున్నాయో చూడండి.. వీడియో..

వీడియో చిన్నదే అయినప్పటికీ.. ఇప్పటివరకు కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు దీనిని లైక్ చేశారు. అంతేకాకుండా కొన్ని లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. అలాగే తల్లి ప్రేమ గురించి తెలిసిన వారు ఈ వీడియోను షేర్ చేశారు. తల్లిని అనాధాశ్రమాల్లో వదిలేసే ఈ సమయాల్లో.. తల్లి కుక్కపై చూపించిన ఈ ప్రేమ కొంతమందికి పెద్ద మోటివ్‌గా నిలుస్తోంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. 

Also Read: Baby King Cobra Video: దోసిలి నిండా నాగుపాము పిల్లలే.. పడగలు విప్పి ఎలా ఆడుతున్నాయో చూడండి.. వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News