)
Big Cobra Snake Video Watch Here: ప్రపంచ సృష్టిలో తల్లి ప్రేమకు మరేది సాటి రాదు.. అది మనిషైనా.. పక్షైన తన బిడ్డలను రక్షించేందుకు ఎంతటి సాహసానికైనా వెనకాడదు.. ఈ కోవాకు చెందిన కోడిపుంజు విరోచిత పోరాటానికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది. కోడి తన పిల్లలను కాపాడేందుకు అత్యంత విషపూరితమైన నాగుపాముతో పోరాడి... చివరికి విజయం సాధించి అందరిని ఆకట్టుకుంటుంది. మనం తరచుగా సోషల్ మీడియాలో ఇతర జంతువులు, పాములు ఒకదానికొకటి దాడి చేసుకోవడం చూసి ఉంటాం.. కానీ ఈ వీడియోలో ఓ కోడి పాముతో పోరాడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ కోడిపెట్ట.. దాని పిల్లలు ఉన్న గూటిలోకి ఒక్క అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన నాగుపాము ప్రవేశించింది.. ఈ విషపూరితమైన నాగుపాము కోడి పిల్లలను చూసి వాటిపై దాడి చేసేందుకు సిద్ధమైంది.. పిల్ల కోళ్లు ఆ పామును చూసి భయపడుతూ అరిచాయి. అంతేకాకుండా ఆందోళన చెందుతూ అటు ఇటు పరిగెత్తాయి.. అయితే అదే సమయంలో వాటి తల్లి పాము పై అరుస్తూ ఆందోళన పడింది. ఇలా కొద్దిసేపు కోడి గూటిలో ఉన్న పిల్లలు అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాయి. ఆ తల్లి కొడుకు కూడా పాము పై దాడి చేసేందుకు సిద్ధంగానే ఉంది..
చివరికి ఆ కోడిపుంజు ఎంతో ధైర్యంగా పాము ఎదురుగా నిలబడి పిల్లలను రక్షించేందుకు సిద్ధమవడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. పాము ఆ కోడి పై దాడి చేసేందుకు కూడా సిద్ధమైంది. దీనిని గమనించిన తల్లి కోడి వెంటనే పాము పై గట్టిగ అరవడం ప్రారంభించింది. దీంతో ఆ పాము కొద్దిసేపు అలాగే ప్రశాంతంగా ఉండిపోయింది. ఆ తర్వాత తల్లి కోడి కూడా కాస్త అరవడం తగ్గించింది. దీంతో వాటి రెండిటి మధ్య పెద్దగా దాడి జరగలేకపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే వైరల్ గా మారాయి.. ఆ సందర్భంలో తల్లి కోడి లేకపోయి ఉంటే ఆ అత్యంత ప్రమాదకరమైన నాగుపాము పిల్లలను ఒక్కటి ఒక్కటిగా తినేసి ఉండేది. తల్లి కోడి ఉండడంతోనే పిల్లలు ఎంతో జాగ్రత్తగా తల్లి చెంతకు చేరాయి..
పాములకు సంబంధించిన అనేక వీడియోలు తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి వీడియోలు చూడడం చాలా అరుదని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు భావిస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో తల్లి సాహసం అందర్నీ బాగోద్వేగానికి గురిచేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు కొన్ని వందల మంది దీనిని వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియోను లైక్ కూడా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి