Tiger Rare Video: చాలా రేర్ వీడియో.. క్యూట్ పిల్లలతో రోడ్డు దాటుతున్న పులి..

Tiger Rare Road Crossing Video: ఇటీవని సఫారీ కి వెళ్ళిన కొంతమందికి అరుదైన సన్నివేశాలు కనిపించాయి. వీటన్నిటిని స్మార్ట్ ఫోన్ ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 30, 2025, 03:04 PM IST
Tiger Rare Video: చాలా రేర్  వీడియో.. క్యూట్ పిల్లలతో రోడ్డు దాటుతున్న పులి..

Tiger Rare Road Crossing Video: ప్రపంచంలో జంతువు ప్రేమికులు ఎంతోమంది ఉంటారు.. వారంతా సెలవులు దొరికితే చాలు సఫారీకి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది అయితే ప్రతి భారం ఏదో ఒక అడవిలోకి సఫారీకి వెళ్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ఆనందంతో పాటు ప్రశాంతత లభిస్తుంది. అందుకే చాలామంది ఎక్కువగా టైం దొరికినప్పుడల్లా సఫారీ కి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా క్రూర మృగాలు కలిగిన అడవుల్లో ఎక్కువగా తిరిగేందుకు కొందరు ఆసక్తి చూపుతూ ఉంటారు. అక్కడ కనబడి జంతువులను చిత్రీకరించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతాయి. అందులో పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలైతే జనాలు మరింత ఆసక్తితో చూస్తారు. 

Add Zee News as a Preferred Source

తాజాగా కొంతమంది సఫారీలో భాగంగా విడుదల చేసిన పులులకు సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. దమ్మనకట్టేలో సఫారీకి వెళ్లిన పర్యాటకులను సందర్శించడానికి ఒక తల్లి పులి తన నాలుగు అందమైన పిల్లలతో బయటికి వచ్చింది. ఎంతో గాంభీరమైన పులి తన పిల్లలతో రోడ్డు దాటడం చూసిన పర్యాటకులు ఆనందంలో మునిగిపోయారు. చాలామంది ఈ పులులకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు.

చాలామంది సఫారీ కి వెళుతూ ఉంటారు కానీ పులులను చూడడం చాలా అరుదు.. ఇతర జంతువులన్నీ కనిపించినప్పటికీ సఫారీలో భాగంగా కొంతమందికి పులులు, సింహాలు కనిపించవు. కానీ శుక్రవారం హెచ్. డి కోటే తాలూకాలోని నాగరహోళే టైగర్ రిజర్వ్‌లోని దమ్మనకట్టే సఫారీ సెంటర్‌లో సఫారీ కి వచ్చిన చాలామందికి అరుదైన  పులులు కనిపించాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఏడు తల్లి పులులతో పాటు నాలుగు అందమైన పులి పిల్లలను కూడా కనిపించినట్లు సమాచారం. పులి పిల్లలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పిల్లలు కనిపించడంతో సఫారీకి వచ్చిన వారంతా వారి కెమెరాలు అరుదైన దృశ్యాలను చిత్రీకరించారు.

ఈ వైరల్ అవుతున్న వీడియోను శిల్ప (శిల్పాప్డ్క్మైసురు) అని ఎక్స్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోలో పులి తన అందమైన ఓ పిల్లను నోట్లో పెట్టుకుని రోడ్డు దాటిస్తున్న సన్నివేశాలు చూడవచ్చు. అంతేకాకుండా అప్పుడే చిన్నచిన్న కాళ్లు వచ్చిన మూడు పులి పిల్లలు తన తల్లి వెంటే రోడ్డు దాటడం కూడా మీరు గమనించవచ్చు. దీనిని చూసిన నేటిజన్స్ వావ్ క్యూట్ అంటున్నారు.  చూసిన వారంతా ఈ వీడియోను లైక్ చేస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News