Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్‌ అసలైన నెల ఆదాయం ఎంతో తెలుసా? మొట్టమొదటిసారిగా రివీల్..

Naa Anveshana Income: ప్రస్తుతం సైబర్ నేరాలు బెట్టింగ్ యాప్స్ పెరగడం వల్ల చాలామంది యువత ఎక్కువగా నష్టపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌(Naa Anveshana)తో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో భాగంగా అన్వేష్ కి సంబంధించిన జీతం రివిల్ అయింది..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 13, 2025, 01:50 PM IST
Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్‌ అసలైన నెల ఆదాయం ఎంతో తెలుసా? మొట్టమొదటిసారిగా రివీల్..

Naa Anveshana Income: బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యువత ప్రాణాలు కోల్పోతున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలామంది యువత ఇంట్లో తెలియకుండా బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులను పెట్టుబడిగా పెట్టి మోసపోయి చివరకు అది తెలుసుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. బెట్టింగ్ యాప్స్ బాధితుల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తోంది. వేళలో పెట్టుబడి పెడితే కోట్లు సంపాదించవచ్చని కొంతమంది యూట్యూబర్స్, ఇన్ ఫ్లుయెన్సర్స్ చేస్తున్న ప్రమోషన్ ను ఆసరాగా చేసుకుని చాలామంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే దీనిని ఎంతమందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం కొందరు సినిమా స్టార్స్ తో కూడా సే నో టూ బెట్టింగ్ అనే నినాదాన్ని కూడా ప్రచారం చేపించింది. ఇలా చాలా వరకు ప్రభుత్వం యువతను బెట్టింగ్ నుంచి తప్పించేందుకు అనేక ప్రచారాలను చేసుకుంటూ వచ్చింది. ఇందులో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక పాత్ర పోషించారు. 

Add Zee News as a Preferred Source

తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ నియంత్రించేందుకు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నా అన్వేషణ అన్వేష్(Naa Anveshana)తో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ చిట్ చాట్‌లో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై మాట్లాడారు. వీటికి సంబంధించిన వీడియోలను సజ్జనల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "మన తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నా అన్వేషణ అన్వేష్ తో ప్రస్తుతం యూట్యూబర్స్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, వారు వివిధ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టుల గురించి మాట్లాడారని.. అలాగే ఆ ప్రమోషన్స్ వల్ల అమాయక ప్రజలపై పడే ప్రభావం అతనితో చర్చించారని.. ప్రమోషన్స్ పట్ల అధికారుల దృష్టికి వస్తున్న అంశాలపై తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడారని" సజ్జనల్ వివరించారు..

ఇలా చిట్ చాట్‌లో భాగంగా సజ్జన బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన ప్రమోషన్స్‌ను ఎలా నియంత్రించాలని అంశాలపై కొన్ని నిమిషాల పాటు క్లుప్తంగా నా అన్వేష్ తో చర్చించారు అంతేకాకుండా యూట్యూబ్ అన్వేష్ (Naa Anveshana) ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్స్ పై పోరాడిన అంశాలపై మాట్లాడుతూ అతన్ని అభినందించారు.. అలాగే అన్వేష్ ఇప్పటివరకు 128 దేశాలు సందర్శించడం తెలుగువారికి గౌరవమని సజ్జనాలు తెలిపారు.. అలాగే ఈ ప్రత్యేకమైన చిట్ చాట్ లో భాగంగా నా అన్వేష్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరగా ఆయన దీనిపై సానుకూలంగా స్పందించారు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, అన్వేష్ (Naa Anveshana) చిట్ చాట్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ చిట్ చాట్ లో భాగంగా నా అన్వేష్ అతనికి వస్తున్న నెలసరి ఆదాయం కూడా అధికారికంగా వెల్లడించారు. ఈ చిట్ చాట్ లో భాగంగా సర్జనార్ నా అన్వేష్ ని మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత ఉందని ప్రశ్న అడగగా.. అన్వేష్ ఆడదాని వయసు, మగవాడి జీతం అడగకూడదని.. చెప్పినా నిజం అవ్వదని అంటూనే.. తన మొదటి ఛానల్ ద్వారా ప్రతి నెల రూ.10 లక్షలు వస్తున్నాయని.. రెండవ యూట్యూబ్ ఛానల్ ద్వారా రూ.3.5 లక్షలు వస్తున్నాయని తెలిపారు..

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News