King Cobra Nagamani Viral Video Now: పురాతనమైన, రహస్యమైన రత్నల్లో నాగమణి కూడా ఒకటి. ఈ రత్నాలు చాలా అరుదైన నాగుపాముల తల భాగంలో ఉంటాయి. వీటిని మన పూర్వీకులు చాలా పవిత్రమైన, శక్తివంతమైన రత్నాలుగా భావించేవారు. ఈ స్నేక్ నాగమణి స్టోన్‌కి సంబంధించిన అనేక పురాణ కథలు ఉన్నాయి. ఒక పురాణ కథ ప్రకారం, నాగలోకంలో 9 రకాల నాగుల తలపై నాగమణి ఉండేందని, ఇవి చాలా శక్తివంతమైనవిగా ఉండేవాని భావిస్తారు. వరాహమిహిరుడు రచించిన బృహత్సంహితలో కూడా ఈ రత్నం గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు. నాగమణి భూమిపై జీవించే అతి అరుదైన రత్నమణి,, దీనిని ధరించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని అందులో పేర్కొన్నారు.
నాగమణి ధరించడం వల్ల అద్భుతమైన, ఆపారమైన శక్తులు లభిస్తాయని, అందుకే పూర్వం రాజులు దీనిని ధరించేవారని సమాచారం. అలాగే రాజులు దీనిని ధరించడం వల్ల పాలించే ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కూడా కురుస్తాయని, అలాగే ప్రజలు కూడా సుభ సంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు. నాగమణి చీకటిలో కూడా ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తుంది. అంతేకాకుండా కొన్ని పాములుకు ఉండే రత్నం నీలి రంగులో కూడా కనిపిస్తుంది. దీంతో పాటు కొన్ని పాములకు ఆకుపచ్చని, ఎరుపు రత్నాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. దీనిని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి..
నాగమణి నిజంగా ఉందా లేదా కేవలం కల్పిత కథల్లో మాత్రమే ఉందా అనేది నేటికీ ఒక రహస్యంగానే ఉంది. అయితే చాలా మంది దీనిని నిజమని నమ్ముతూ ఉంటారు. మరికొంతమందైతే కట్టుకథలుగా కొట్టిపారేస్తూ ఉంటారు. నిజానికి నాగమణికి సంబంధించి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కొంతమంది పాము తలను రెండు ముక్కలుగా చేసి, అందులో నాగమణి తీసిన వీడియోలు తరచుగా చూసి ఉంటారు. తాజాగా ఓ నాగమణికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నాగమణికి సంబంధించిన వీడియోను @ది_కింగ్_మక్రాట్ప్రిన్స్ అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. అంతేకాకుండా వృద్ధ పాము అనే ట్యాగ్ పెట్టి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పాము తల భాగంలో లైట్ బ్లూ కలర్ కలిగిన రత్నం చూడొచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని వేల మంది వీక్షించారు. దీనిని పోస్ట్ చేసి చాలా రోజులవుతున్న ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









