
Nagamani Pearl Stone Video Watch Here: నాగమణిని ఒక పురాతనమైన రత్నంగా చెప్పుకుంటారు. ఇది ఒక అరుదైన మణిగా కూడా పరిగణిస్తారు. ఇది ఎక్కువగా అరుదైన నాగుపాములకు సంబంధించిన తలపై పెరుగుతుంది. పూర్వికులు ఈ నాగమణిని చాలా పవిత్రమైనదిగా భావించేవారు. దీనిని ధరించడం వల్ల కొన్ని అద్భుతమైన శక్తులు వస్తాయని నమ్ముతూ ఉండేవారు. నాగమణికి సంబంధించిన అనేక కథనున్నాయి. అందులో కొన్ని ప్రసిద్ధి.. నాగ లోకంలో 9 రకాల నాగుపాములు ఉండేవని.. వీటి తలలపై నాగమణి పెరిగేదని.. అవి చాలా శక్తివంతమైన అని కూడా కొన్ని కథల్లో ప్రస్తావించారు.
ఆగమనికి సంబంధించిన కొన్ని కథల ప్రకారం.. కొన్ని వందల ఏళ్ల క్రితం, రాజులు నాగమణి ధరించారని.. దీనివల్ల రాజ్యమంత సుఖసంతోషాలతో వర్ధిల్లుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రత్నాన్ని ధరించిన చాలామంది రాజ్యాలను కూడా ఓడిపోకుండా సొంతం చేసుకున్నారని అనేక కథల్లో ప్రస్తావించారు. ఈ నాగరత్నం పెట్టుకోవడం వల్ల కొన్ని అద్భుతమైన శక్తులు శరీరంలోకి ప్రవేశిస్తాయని భారతీయుల నమ్మకం. అందుకే అప్పటినుంచి ఇప్పటివరకు చాలామంది నాగమణిని ధరిస్తూ వస్తున్నారు. నాగమణి రత్నాన్ని కొంతమంది పాములు పట్టేవారు విగ్రహిస్తున్నారు.
పాములు పట్టేవారు నాగమణి రత్నం కలిగిన కొన్ని పాములను పట్టి తలభాగాన్ని కోసి విక్రయిస్తున్నారు. అయితే నాగమణులు అన్ని రత్నాల కంటే చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి చీకట్లో కూడా వెలుగులు చిమ్మె అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. అయితే ఇలాంటి పాములు భూమిపై చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా నాగమణికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చీకట్లో ఓ నాగుపాము నాగమణి వెలుగులో కెమెరాకు ఫోజులు ఇవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు..
వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ నాగుపాము చీకట్లో కూర్చుని పడగవిప్పి ఉండడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ పాము కిందనే ఒక రత్నం దగదగా మెరుస్తూ ఉండడం కూడా మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో దగదగా మెరుస్తున్న రత్నం ఏంటో కాదు.. అది అతి శక్తివంతమైన నాగమణి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీనిని ప్రదీప్ కుమార్ అనే ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు కొన్ని వేలమందికి పైగా దీనిని వీక్షించారు. అయితే ఈ పాము తల భాగంలో ఉండాల్సిన రత్నం కింద ఉండడంతో.. పాము తల భాగం నుంచి జారిపోయి.. కింద పడినట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి