Nagamani Stone Video Watch Here: ప్రస్తుతం చాలా మందికి నాగమణి గురించి తెలియదు.. పురాణాల్లో నాగమణి గురించి వివిధ కథలున్నాయి. దీనిని ఒక రహస్యమైన రత్నంగా కూడా చెప్పుకుంటారు. ఇది నాగుపాము తల లోపలి భాగంలో ఉంటుంది. అంతేకాకుండా దీనిని ధరించడం వల్ల జీవితంలో అదృష్టంతో పాటు ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయని ఒక నమ్మకం.. పూర్వకాలంలో దీనిని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ రత్నాన్ని ధరించేవారట.. దీని వల్ల అన్ని అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందట..
పురాణాల్లో తెలిపిన వివరాల ప్రకారం, ఈ రత్నాలు కేవలం అరుదైన కింగ్ కోబ్రా పాములకు సంబంధించిన జాతుల్లో మాత్రమే లభిస్తాయట.. దీంతో పాటు ఇవి కేవలం తలకు సంబంధించిన పై భాగంలో ఉంటుంది. అలాగే ఈ రత్నంలో కింగ్ కోబ్రాకు ఉండే శక్తులను బట్టి అందులో కూడా మాయాశక్తులు ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది ఈ మణి నాగుపాములో ఉండే విషం పూర్తిగా గడ్డకట్టడం వల్ల ఏర్పడుతుంది. అలాగే కొంతమంది మాత్రం ఈ రత్నం పాములకు దేవుడు ఇచ్చిన వరంగా కూడా చెప్పుకుంటారు.
ప్రస్తుతం చాలా మంది పాములు పట్టేవారు నాగమణులను విక్రయిస్తున్నారు. కానీ ఈ నిజమైన రత్నాలు చాలా అరుదుగా లభిస్తూ ఉంటాయి. ఒరిజినల్ నాగమణులు మాత్రం చీకట్లో చాలా ప్రకాశవంతంగా మెరుస్తాయి. అంతేకాకుండా ఇవి చాలా వరకు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అంతేకాకుండా కొన్ని పాములు ఎరుపు రంగుల్లో కూడా ఇవి లభిస్తాయని సమాచారం. అయితే దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో స్నేక్ క్యాచర్స్ నాగమణి తీస్తున్న దృశ్యాలు చూడొచ్చ. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ ఇద్దరు పాములు పట్టేవారు కింగ్ కోబ్రాను పట్టుకుంటారు. అయితే ఇంతలోనే అక్కడే ఉండే స్థానికులు వారి చుట్టు చేరుతారు. వారు ఆ పట్టుకున్న పాము తలను చాక్‌తో కట్ చేసి, అందులో రత్నాలు తీయడం గమనించవచ్చు. అలాగే ఇలా తీసిన రత్నాలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని, పాములు దరిచేరవని చెప్పి.. విక్రయించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









