)
Two Cobra snakes coiled around shiva Lingam in Nellore video: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన గుళ్లలో కార్తీక మాసం శోభ కన్పిస్తుంది. ముఖ్యంగా ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో కార్తీక మాసంలో శుద్ద చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. ఈరోజున ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో అధ్బుత ఘటన చోటు చేసుకుంది.
నెల్లూరు జిల్లా మనుబోలులో విశ్వనాథస్వామి ఆలయంలో శివలింగం పక్కన రెండు నాగుపాములు పడగవిప్పి కన్పించాయి. దీంతో భక్తులు స్వయంగా నాగదేవత తమను అనుగ్రహించడానికి వచ్చారంటూ భక్తితొ పొంగిపోతున్నారు. రోజులాగే పూజారీ ఆలయంకు వచ్చాడు. అప్పటికే చాలా మంది భక్తులు ఆలయంతో బైట వేచి చూస్తున్నారు.
నాగుల చవితి రోజు అద్భుత దృశ్యం
శివలింగంపైన పడగవిప్పి నిల్చున్న నాగుపాములు
నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో గుడి ప్రాంగణంలోని శివలింగంపైకి చేరుకొని పడగవిప్పి నిల్చున్న రెండు… pic.twitter.com/LmGDUk6OAL
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2025
ఇంతలో దేవాలయం తలుపులు తెరిచే సరికి రెండు నాగు పాములు పడగ విప్పి మరీ శివలింగంపై ఉన్నాయి. దీంతో పూజారీ, భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. ఒకవైపు నాగుల చవితి, మరోవైపు కార్తీక మాసం నేపథ్యంలో ఈ విధంగా జంట నాగులు కన్పించడంతో అందరు ఆనందంతో ఈ ఘటన చూసి పొంగిపోతున్నారు.
శివలింగంపై ఉన్న నాగులకు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఇది దేవుడి మహిమ అంటూ అందరు ఈ సన్ని వేశాన్నితమ ఫోన్ లలో రికార్డు చేశారు. అయితే శివలింగం పక్కనే పుట్ట ఉంది.. అక్కడి నుంచి నాగుపాము బయటకు వచ్చిందంటున్నారు.
అయితే కొద్దిసేపు అక్కడే ఉన్న పాములు తిరిగి పుట్టలోకి వెళ్లిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భక్తితో పొంగిపోతున్నారు. నాగుల చవితి రోజున స్వయంగా నాగదేవత తమను అనుగ్రహించడానికి వచ్చారంటూ భక్తులు తన్మయత్వంతో దేవుడికి పూజలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook