)
Newly wed couple first night Trending video: ఇటీవల కొంత మంది ఓవర్ నైట్ లో ఫెమస్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ చేస్తు ఫాలోవింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంత మంది ఎత్తైన జలపాతాలు, సముద్రాలు, క్రూర జంతువుల దగ్గరకు వెళ్లి రీల్స్ చేస్తున్నారు. అంతే కాకుండా రీల్స్ పిచ్చిలో పడి తమ లైఫ్ ను మాత్రమే కాకుండా.. ఎదుటి వాళ్ల ప్రాణాల్ని కూడా రిస్క్ లో పడేస్తున్నారు.
కొంత మంది మరీ ఘోరంగా తమ పర్సనల్ లైఫ్ ను, ప్రైవేటు పనుల్ని కూడా రీల్స్ చేస్తు వ్యూస్ కోసం పాకులాడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక కొత్త జంట చేసిన పని నెట్టింట వివాదంగా మారింది. యువతీ, యువకులు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు కూడా తమ ఫస్ట్ నైట్ కు రెడీ అయిపోయారు.
మరీ దీన్ని కూడాఎందుకు రీల్స్ చేయోద్దని అనుకున్నారో ఏంటో కానీ మొత్తంగా తమ ఫస్ట్ నైట్ కార్యక్రమంను కూడా రీల్స్ చేస్తు హల్ చల్ చేశారు. కొత్త జంట అందంగా రెడీ అయి తమమెడలో మల్లెపూల మాలల్ని వేసుకున్నారు. గదిలో అందంగా మల్లెపూలతో డెకొరెషన్ చేశారు. వీరిలో కొంత మంది ఫోన్ లలో లైవ్ కూడా పెట్టారు. తమ ఫోన్ లలో రికార్డులు చేశారు.
మొత్తంగా వీరిద్దరు తమ గదిలోకి వెళ్లేటప్పుడు మొత్తంగా ఎలా వెళ్లారో అదంతా, జనాలకు తెలిసేలా ఫోన్లలో రికార్డు చేశారు. ఆతర్వాత గడియ పెట్టుకుని కొత్త జంటలోనికి వెళ్లారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వీరిపై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఏంచేస్తారోఅది కూడా పెట్టేయండని కూడా పంచ్ లు వేస్తున్నారు. ఇలా తయారయ్యారెంట్రా అంటూ మరికొంత మంది సెటైర్ లు వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.