Two venomous cobra Snakes on nandi statue video: దేశ మంతట కూడా హిందువులంతా ప్రస్తుతం నిర్జల ఏకాదశి వేళ పూజల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రెండు కోబ్రా పాములు నంది కొమ్ముల మీదకు చేరి భక్తుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. పాముల వీడియోలు ఇటీవల ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా పాముల వీడియోలను ఎక్కువగా చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఈక్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రెండు భారీ సర్పాలు శివాలయంలోని నందీశ్వరుడి కొమ్ముల మీదకు ఎక్కి నాట్యం చేస్తున్నాయి. నాగుపాములు నందీశ్వరుడి మెడలో ఉంటాయి. అలాంటిది ఇక్కడ మాత్రం అవి తమ శివుడి వాహానమైన నందీశ్వరుడి మీదకు ఎక్కి మరీ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాయి.
ఆలయంలో ఈ ఘటన చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. మొత్తంగా రెండు పాములు ఏ మాత్రం భయపడకుండా.. నందీశ్వరుడి మీదకు ఎక్కి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ.. వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
దీన్ని చూసిన నెటిజన్ లు నిర్జల ఏకాదశి వేళ అద్భుతం అంటూ కూడా శివుడి నామస్మరణ చేస్తు.. భక్తిభావనలతో పొంగిపోతున్నారు. మరికొందరు మాత్రం.. ఆ పాములు అక్కడికి ఎలా వెళ్లాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జంట పాములు నందీశ్వరుడిపై ఉన్న వీడియోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.









