Video Call Last Rites: వీడియో కాల్‌లో అంత్యక్రియలు.. ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లే!

Nepali Family Last Rites In Video Call: రెక్కాడితే డొక్కాడని ఆ కుటుంబంలో అనూహ్య మరణం సంభవించింది. దీంతో మృతదేహాన్ని స్వస్థలం తీసుకెళ్లే స్థోమత లేక వీడియో కాల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 4, 2025, 04:43 PM IST
Video Call Last Rites: వీడియో కాల్‌లో అంత్యక్రియలు.. ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లే!

Last Rites In Video Call: పొట్ట చేత పట్టుకుని తెలంగాణకు వచ్చిన నేపాలీ కుటుంబం తోచిన పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే అనూహ్యంగా కుటుంబంలోని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతికి గురయ్యింది. అతడి మరణం జీర్ణించుకోలేకపోవడమే కాకుండా అతడి అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి. దీంతో స్వదేశం తరలించలేక అతడి కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే స్వదేశంలో ఉన్న కుటుంబసభ్యులు వీడియో కాల్‌లో అంత్యక్రియలు చూశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Newly Married Bride: ప్రేమించిన వ్యక్తితో గోవాలో పెళ్లి.. ఆరు నెలలకే నవవధువు ఆత్మహత్య

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగో ఫేజ్‌లో ప్రేమ్ రావల్ (34) కుటుంబం నివసిస్తోంది. నేపాల్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి అతడు హౌస్‌ స్కీపింగ్ చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబసమస్యలతో అతడు ఈనెల ఒకటో తేదీన అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రేమ్‌ రావల్‌ కుటుంబం వివరాలు ఆరా తీశారు. నేపాల్‌లో ఉన్న కుటుంబసభ్యులకు సమాచారం అందించగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్లు రాలేమని చెప్పారు.

Also Read: MK Stalin: 'కొత్తగా పెళ్లయిన వారికి ముఖ్యమంత్రి సంచలన విజ్ఞప్తి.. పిల్లలను కనేయండి'

తాము రాలేమని చెప్పడంతో రాజస్థాన్‌లో నివసిస్తున్న రావల్‌ అన్నయ్య బల్వ బహదూర్‌ రావడంతో అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అప్పగించారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్వదేశం నేపాల్‌కు మృతదేహాన్ని తరలించే స్థోమత లేదని చెప్పాడు. దీంతో పోలీసుల సహాయంతో కేపీహెచ్‌బీ కాలనీలోని ఏడో ఫేజ్‌లో ప్రేమ్‌ రావల్‌ దహన సంస్కారాలు. నిర్వహించారు. అయితే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబసభ్యులు అంత్యక్రియలకు రాలేదు. దీంతో వారంతా వీడియో కాల్‌లో అంత్యక్రియలను ప్రేమ్ రావల్ చూపించారు. అంత్యక్రియలు జరుగుతుండగా ఆ తంతును నేపాల్‌లో ఉన్న కుటుంబసభ్యులు వీక్షించారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News