up govt no helmet no fuel policy funny business idea video: సాధారణంగా రోడ్లపైకి వాహానాలపైన వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు చెప్తుంటారు. టూవీలర్ లు హెల్మెట్ లను తప్పకుండా వేసుకొవాలి. అదే విధంగా కారులో ప్రయాణించే వాళ్లు సీటు బెల్ట్ లను తప్పకుండా ధరించాలని చెప్తుంటారు. అయిన కూడా కొంత మంది దీన్ని పాటించరు. ఇలాంటి వారు కొన్ని సార్లు ప్రమాదాల్లో చిక్కుకుంటారు. దీంతో ప్రభుత్వాలు ఇటీవల కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి.
రోడ్డు మీద హెల్మెట్ లేకుండా వస్తే జరిమానాను విధిస్తున్నారు. మరికొన్ని చోట్ల హెల్మెట్ లేకుండా.. పెట్రోల్ బంక్ లలో పెట్రోల్ ను పోయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లో యోగి సర్కారు కూడా ఇలాంటి కఠినమైన రూల్స్ ను తీసుకొచ్చింది. యూపీలో బైకర్స్ హెల్మెట్ లను ధరించకుండా.. పెట్రోల్ బంక్ లకు వెళ్తే పెట్రోల్ ను పోయోద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
దీని వల్ల సదరు వాహాన దారులు హెల్మెట్ ను తప్పకుండా ధరిస్తారని, ప్రమాదాల బారి నుంచి బైటపడతారని తీసుకొచ్చారు. కానీ కొంత మంది దీన్ని కూడా పాటించకుండా.. నెగ్లీజెన్సీగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో ఇలాంటి వారిని క్యాష్ చేసుకునేందుకు ఒక వ్యక్తి ఏకంగా పెట్రోల్ బంక్ కు దగ్గరగా ఒక బిజినెస్ ఐడియాతో అందర్ని షాక్ కు గురిచేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.
పెట్రోల్ బంక్ కు దగ్గరలో.. హెల్మెట్ లను అద్దెకు ఇచ్చే బిజినెస్ స్టార్ట్ చేశారు. హెల్మెట్ లేని వాళ్లు.. ఇతని దగ్గరకు వచ్చి రూ. 5 ఇచ్చి హెల్మెట్ పెట్టుకుని బంక్ లోకి వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. మరల బైటకు వచ్చి.. హెల్మెట్ ఇచ్చేసి వెళ్లిపోతున్నారు. అంటే సింపుల్ గా కూర్చున్న చోట బిజినెస్ ఐడియాతో డబ్బులు సంపాదిస్తున్నాడు.
ఇతగాడి.. ఐడియాను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది కదా అసలైన బిజినెస్ ఐడియా అంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరు రూల్స్ అతిక్రమించేందుకు.. చూపిస్తున్న తెలివి తేటలు పాటించడంలో చూపిస్తే బాగుపడుతారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆ హెల్మెట్ రూల్ తీసుకొచ్చింది ప్రజల కోసమే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇతగాడి టాలెంట్ మాత్రం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









