)
Old Woman showing Aadhaar card in train journey video: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్నాటకలో కూడా ఉచిత బస్సు ప్రయాణంను అమలు చేస్తున్నారు. ఫ్రీబస్సు సర్వీసుకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ప్రతిరోజు కూడా వేలాది మంది ఉచిత బస్సు సేవల్ని ఉపయోగించుకుంటున్నారు.
ರೈಲಿನಲ್ಲಿ ಉಚಿತ ಪ್ರಯಾಣಕ್ಕಾಗಿ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ತೋರಿಸಿದ ಅಜ್ಜಿ...
ಪಾಪ ಆ ಮುಗ್ದ ಮನಸ್ಸಿಗೇನು ಗೊತ್ತು ರೈಲ್ವೆ ಇಲಾಖೆಯನ್ನು ಆಳುವ ಮೋದಿ ಒಬ್ಬ ಬಡವರ ವಿರೋಧಿ ಎಂದು..ಈ ಅಜ್ಜಿಯ ಕನಸು ನನಸಾಗಲು ನಮ್ಮ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅಥವಾ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಪ್ರಧಾನಿಯಾಗಬೇಕು.@siddaramaiah pic.twitter.com/5SOrbD2aqr
— Sikandar - ಸಿಕಂದರ್. (@SikkuTweets) September 26, 2025
అయితే.. బస్సులలో ఇటీవల మహిళలు కొట్టుకొవడం వంటి ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది ఉచిత బస్సు జర్నీని పూర్తిగా మిస్ యూజ్ చేస్తున్నారు. రోజు ఉచిత బస్సుకు సంబంధించిన రచ్చలు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. ఒక బామ్మ రైలులో టికెన్ చూపించమని అడిగితే.. ఆధార్ కార్డు టీటీ చేతిలో పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒక బామ్మ ట్రైన్ లో జర్నీ చేస్తుంది. మరీ పాపం బామ్మకు బస్సులోఫ్రీ జర్నీ ఉంది.. మరీ ట్రైన్ లో కూడా ఉందా అని అనుకుందో ఏంటో కానీ .. ఆమె రైలు ఎక్కి టికెట్ కొనకుండానే కూర్చుంది. తీరా టీటీ రానే వచ్చాడు.
టికెట్ చూపించమని అడిగితే ఆమె తన ఆధార్ కార్డు తీసుకుని టీటీచేతిలో పెట్టింది. అది చూసి టీటీ షాక్ అయ్యాడు. బామ్మ అమాయకత్వానికి ఏమి అనలేక నవ్వుకున్నాడు. టికెట్ తీసి ఇచ్చాడు. ఈ ఘటనను కొంత మంది వీడియో తీశారు. ప్రస్తుతం అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు ఫన్నీగా నవ్వుకుంటున్నారు. బామ్మ రాక్.. టీటీ షాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook