Orgninal Snake Dimond Video: నాగుపాము తలకు అరుదైన నాగరత్నం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..

Orgninal Snake Dimond Video Viral: అత్యంత ప్రమాదకరమైన ఓ నాగుపాము తలభాగంలో ఉన్న నాగమణికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. విషపూరితమైన నాగుపాము తలపై భాగంలో ఒక అరుదైన రత్నాన్ని చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 15, 2025, 04:09 PM IST
Orgninal Snake Dimond Video: నాగుపాము తలకు అరుదైన నాగరత్నం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..

Orgninal Snake Dimond Video Watch: పూర్వకాలంలో నాగమణులు నాగుపాముల నుంచి సేకరిస్తారని ఎన్నో కథల్లో క్లుప్తంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఇవి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉండే మణులుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పూర్వకాలంలో వీటిని ఎక్కువగా రాజులు ఉంగరాలతో కలిపి ధరించేవారు. ఇలా ధరించడం వల్ల యుద్ధాల్లో సులభంగా విజయాలు సాధిస్తారని ఒక నమ్మకం ఉండేది. అంతేకాకుండా ఈ అరుదైన నాగమనులను ధరించడం వల్ల రాజ్యం మొత్తం సుభిక్షంగా ఉంటుందని అప్పట్లో ప్రజలు నమ్మేవారు. అందుకే అప్పుడు నాగమణిలకు ప్రత్యేకమైన డిమాండ్ ఉండేది. పోను పోను ఈ డిమాండ్ కాస్త తగ్గుతూ వచ్చింది. అంతేకాకుండా నాగమణులు కనిపించడం అరుదైపోయింది. 

Add Zee News as a Preferred Source

కానీ ఇటీవల నాగమనులకు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. ఈ వీడియోలు ఊహించని స్థాయిలో వైరల్ అయ్యాయి. యూట్యూబ్‌తో పాటు ఇంస్టాగ్రామ్‌లో అప్పుడప్పుడు ట్రెండింగ్‌గా కూడా నిలిచాయి. తాజాగా ఇదే కోవాకు చెందిన ఓ వీడియో ఇప్పుడు ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అత్యంత అరుదైన నాగుపాము తల పై భాగంలో ఒక నీలిరంగు తో కూడిన నాగమణి వజ్రం ఉండడం మీరు చూడొచ్చు. 

అంతేకాకుండా ఈ వీడియోలో ఆ నాగుపాము తలపై భాగంలో నీలిరంగు తో కూడిన నాగమణి అటు ఇటు కదులుతున్నప్పటికీ ఏమాత్రం తలపై భాగం నుంచి జారిపోకుండా ఉండడం కూడా గమనించవచ్చు. అలాగే పాము దగ్గరనుంచి ఈ వీడియోను తీసినప్పటికీ.. ఆ పాము ఏ మాత్రం మనుషులపై దాడి చేయలేకపోవడం చూడొచ్చు. నాగుపాము తలపై భాగంలో ఉన్న అరుదైన వజ్రం కూడా మిల మిల మిరవడం చూడొచ్చు. సాధారణంగా ఇలాంటివి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది వీడియోలో క్లియర్‌గా కనిపించడం చూసినా చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

Also Read: Shani Dev Effects: నవంబర్‌లో శని ప్రత్యక్ష కదలికలు.. ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్.. ఊహించని ఆదాయం!

ఈ వీడియోలో నాగమణి నిజమైందేనా?
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. నాగుపాము తలభాగం పైన మిల మిల మెరుస్తున్న ఒక అరుదైన నీలిరంగు వజ్రం చూడొచ్చు. అయితే, ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది నిజమైన నాగమణి కాదని కామెంట్లు చేస్తున్నారు. ఎవరో కావాలని నాగుపాము తలపై భాగంలో ప్లాస్టిక్‌తో తయారుచేసిన ఒక వజ్రం లాంటి ఆకారం కలిగిన వస్తువును అతికించారని చెబుతున్నారు. ఇప్పుడు ఈ వైరల్ అవుతున్న వీడియోను దాదాపు 30 వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది.

Also Read: Shani Dev Effects: నవంబర్‌లో శని ప్రత్యక్ష కదలికలు.. ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్.. ఊహించని ఆదాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News