Pahalgam Animation Video: పహల్గం ఘటన.. ప్రతి ఒక్కర్ని రక్తం మరిగేలా గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో ఇదే..

Pahalgam Attack: పహల్గం ఘటనపై ప్రస్తుతం దేశమంతట కూడా పౌరుల రక్తం మరిగిపోతుంది. ఈ క్రమంలో ఒక ఎనిమేషన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్ లు తమ అభిప్రాయాల్నికామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 26, 2025, 03:11 PM IST
  • పహల్గం ఘటన..
  • గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..
Pahalgam Animation Video: పహల్గం ఘటన..  ప్రతి ఒక్కర్ని రక్తం మరిగేలా గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో ఇదే..

Pahalgam Animation Video: జమ్ములోని పహల్గం ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఏప్రిల్ 22న పహల్గంలో అమాయకులైన టూరిస్టులపై ఆర్మీదుస్తులో వచ్చిన టెర్రరిస్టులు మతం అడిగి మరీ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనను.. భారత్ దేశంతో పాటు, ప్రపంచ దేశాలు సైతం ఖండించాయి. ఇప్పటికే మోదీ ఆధ్వర్యంలో కెబినెట్ మంత్రులు, హైపవర్ కమిటీ ఆధర్యంలో పలుమార్లు సమావేశాలు జరిగాయి.

Add Zee News as a Preferred Source

కేంద్రం పాక్ ను.. అష్టదిగ్గందనం చేసింది. సింధుజలాల ఒప్పందంను రద్దు చేసుకుంది. అంతే కాకుండా పాక్ పౌరులు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక ఎనిమేషన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.

 

దీనిలో భారత్ లోని పహల్గంలో దాడి జరిగిన ఘటన .. ఆ తర్వాత మోదీ, అమిత్ షాల పర్యటన తదితర అంశాలు ఉన్నాయి. అదే విధంగా ముష్కరులపై మాత్రం ఇంకా బాంబుల్లా విరుచుకుపడాలని దీనిలో చూపించారు. మహా భారతం థీమ్ కాన్సెప్ట్ గా.. కౌరవులపై పాండవుల వైపు ఉండి.. శ్రీకృష్ణుడు ధర్మపోరాటం చేస్తాడు.

అదే విధంగా ఇప్పుడు.. కూడా అదే విధంగా టెర్రరిస్టులు, ఉగ్రవాదులపై అదే విధంగా విరుచుకుపడాలని కూడా ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు గూస్ బంప్స్ తెప్పించేదిలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. పహల్గం ఘటనపై మాత్రం అన్ని రకాలుగా  పాక్ ను ఏకాకీని చేసే చర్యలు చేపట్టింది.

ఇప్పటికే పాక్ లోని పౌరులను మనదేశం నుంచి వదిలివెళ్లలిపోయేలా చూడాలని కేంద్రం అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. దీంతో భారత్, పాక్ ల మధ్య యుద్దం అని వార్యం అని సంకేతాలు మాత్రం స్పష్టంగా వస్తున్నాయి. మరోవైపు పాక్ మాత్రం మేకపోతు గాంభీర్యం చూపిస్తు.. ఎప్పటిలాగే భారత్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తు, కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.

Read more: Seema Haidar:  భారత్ , పాక్ ల మధ్య ఉద్రిక్తతలు... సంచలన నిర్ణయం తీసుకున్న సీమా హైదర్..  

తాజాగా.. పాక్ ప్రధాని చేసిన కామెంట్లను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఒకవైపు ఉగ్రదాడిని ఖండిస్తునే.. మొసలి కన్నీళ్లను కార్చింది. మరోవైపు పాక్ పై ఆరోపణల్ని ఊరుకోమంటూ షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత్ ను అన్ని రకలుగా పాక్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది. దీంతో భారత్ అదే విధంగా బుద్ది చెప్పేందుకు చర్యలు తీసుకుంటుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News